Janhvi Kapoor: లంగా ఓణీలో సైతం కుర్రాళ్లకు కిరాక్ పుట్టిస్తున్న జాన్వీ కపూర్ అందం.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టి దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చింది. అయినా ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది శ్రీదేవి తనయ.
ఫస్ట్ సినిమా 'ధడక్' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీకపూర్. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ చిత్రాలు ఓటీటీ వేదికగానే విడుదలయ్యాయి.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో తెలుగులో సత్తా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది.
జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ తెచ్చుకోవడం పక్కా అని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.
మొత్తంగా తెలుగులో తారక్ తో చేస్తోన్న దేవర రెండు పార్ట్ లతో పాటు రామ్ చరణ్ తో RC 16 మూవీలతో ఇక్కడ తెలుగులో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది.
జాన్వీ కపూర్..రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో పాటు ప్రభాస్, హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రంలో దాదాపు ఈ భామనే కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.