Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్ లో జాన్వీ కపూర్ పరువాల జాతర.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Thu, 24 Oct 2024-11:02 am,

జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని తెలుగు చిత్ర సీమను నమ్మకుంది. అందుకు  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ మూడు భాషల్లో మంచి  సక్సెస్ అందుకోవడం విశేషం. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చింది.తాజాగా ‘దేవర’ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్ కే దక్కింది. దర్శకుడిగా కొరటాలకు కూడా ఏమి దక్కలేదనే చెప్పాలి.   ఈ సినిమాలో జాన్వీ నటించానన్న సంతృప్తి తప్పితే పెద్దగా ఒరిగిందేమి లేదు.

 

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’ సక్సెస్ తో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చూపెట్టింది. మొత్తంగా ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ ఎన్టీఆర్ కే పోయినా.. జాన్వీకి  కూడా ఎంతో కొంత పేరు వచ్చింది.

‘దేవర పార్ట్ -1’లో జాన్వీ పాత్ర కొద్ది సేపు ఉన్న.. రాబోయే ‘దేవర పార్ట్ -2’తో పాటు రామ్ చరణ్ తో చేస్తోన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ తో తెలుగులో జెండా పాతాలనే కృత నిశ్చయంతో ఉంది.

 

జాన్వీ కపూర్. ఫస్ట్ సినిమా 'ధడక్‌'. ఈ సినిమాలో మరాఠిలో హిట్టైన ‘సైరత్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.  ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.  కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  సినిమాలు ఎక్కువ మటుకు  ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.

శ్రీదేవి కూతురుగానే జాన్వీ కపూర్ కు  వరుస ఛాన్సులు వస్తున్నాయి. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

జాన్వీ కపూర్..రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో  పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రంలో దాదాపు జాన్వీ కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link