Janhvi Kapoor Photos: టైట్ ఫిట్ డ్రెస్సులో కాకరేపుతున్న జాన్వీ కపూర్

Wed, 31 May 2023-9:30 pm,

అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి కుమార్తెగా హిందీ పరిశ్రమకు పరిచయమైన జాన్వీ కపూర్ అతి తక్కువ కాలంలోనే అనేక సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా ఆమెకు హిట్టు తీసుకు రాలేకపోయింది. 

ఎక్కువగా చేసింది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం ఆ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చకపోవడంతో ఆమె కెరీర్ అయిపోయింది అని భావిస్తున్న తరుణంలో ఆమెకు తెలుగు సినిమాలో అవకాశం దక్కింది. 

ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకుండానే ఆమె ఏకంగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. 

ఇక ఆ దెబ్బతో సౌత్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది. 

 

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వేసవిలో ఆమె హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link