School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. హైదరాబాద్ స్కూళ్లకు ఈనెలలో 9 రోజులు సెలవు..!
స్కూళ్లకు మరోసారి తొమ్మిది రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. జనవరి నెలలో తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాలో ఏకంగా తొమ్మిది రోజులు స్కూల్స్ బంద్ ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇది ఎగిరిగంతేసే న్యూస్ ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో మొత్తం గా నాలుగు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకటో తేదీ సెలవు ఇచ్చారు. ఇక భోగి జనవరి 13వ తేదీ, సంక్రాంతి-14, పబ్లిక్ హాలిడే.ఇవి కాకుండా జనవరి 26 కూడా సెలవు దినాలు.
అయితే జనవరి 26 ఆదివారం రానుంది. ఈరోజు స్కూలు హాలిడే మిస్ అయినట్లే. హైదరాబాద్ లో ఈరోజుల్లో మాత్రమే కాదు రెండో శనివారము, మిగతా ఆప్షనల్ హాలిడేస్ కూడా ఉన్నాయి. హజరత్ అలీ జనవరి 14, కనుమ జనవరి 15, జనవరి 25 షబ్ ఏ మేరజ్ కూడా సెలవు దినాలు.
ఇక హజ్రత్ ఆలీ పండుగ ఆప్షనల్ హాలిడే అయినా కానీ జనవరి 14న సంక్రాంతి కూడా రానుంది .కాబట్టి ఈరోజు కూడా సెలవు అయితే తెలంగాణలోని ఈ అన్ని స్కూళ్లకు ఈ హాలిడేస్ వర్తించవు. ఆయా స్కూళ్లు తీసుకునే నిర్ణయం మేరకు హాలిడేలు ఉంటాయి.
2024లో భారీగానే స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ముఖ్యంగా వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు వచ్చాయి. మార్చినెలలో పది, ఇంటర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది.