Jhanvi Kapoor: మెరిమైడ్ డ్రస్సులో జాన్వి కపూర్.. అతిలోకసుందరిలా!
దానికి తగ్గట్టుగానే ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఇక త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది ఈ హీరోయిన్.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమాతో తెలుగు డేబ్బ్యు ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం.. ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వి కపూర్...ఫస్ట్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
మరోపక్క మొదట సినిమా విడుదల కాకముందే.. తెలుగులో రెండో సినిమా కూడా సొంతం చేసుకుంది జాన్వి కపూర్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. రామ్ చరణ్ చెయ్యనున్న తన 16వ సినిమాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుంది.
కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో మేరిమైడ్ డ్రెస్సులో తశ తళ మెరిసిపోయింది ఈ హీరోయిన్. ఈ ఫోటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.