Reliance Jio: ముఖేష్ అంబానీ మాస్టర్ స్ట్రోక్.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కూడా ఫ్రీ..
రిలయన్స్ జియో మాస్టర్ స్ట్రోక్ రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ చెక్ పెడుతూ కొత్త రీఛార్జి ఆఫర్లు తీసుకువచ్చింది... మూడు నెలల వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జి ప్లాన్ కేవలం రూ.479 కే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు ఇతర లాభాలు కూడా పొందుతారు. ఇది పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్.
జియో అందిస్తున్న ఈ రూ. 479 రీఛార్జ్ ప్లాన్ ఎవ్వరైనా కూడా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జియో పోర్టల్ లేదా 'మై జియో యాప్' ద్వారా సులభంగా ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవచ్చు.. పేటీఎం లేదా ఫోన్ పే ఆధారంగా ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి..
జియో అందిస్తున్న ఈ రూ. 479 రీఛార్జి ప్లాన్ లో మీరు 6gb హై స్పీడ్ ఇంటర్నెట్ వ్యాలిడిటీ సమయం మొత్తం పొందుతారు. డేట్ పూర్తయిపోయిన తర్వాత 64 కేబిపిఎస్ లిమిట్ పొందుతారు.
ఇందులో అపరిమిత లోకల్ ఎస్.టి.డి కాల్స్ కూడా పొందే సౌకర్యం ఉంది. అదనంగా ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది మాత్రమే కాదు దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా ఉచితంగా పొందుతారు.
మూడు నెలలు పాటు మీ సిమ్ యాక్టీవ్ లో ఉండాలనుకునే వారికి ఇది జియో మంచి ఆఫర్. కేవలం రూ. 479 అందుబాటులో ఉంది. అంతే కాదు ఇందులో డేటా లిమిట్ కూడా ఇస్తున్నారు.
జియో అందిస్తున్న మూడు నెలల ప్యాక్‌లో రూ. 479 ప్లాన్ తో పాటు రూ.799 రూపాయల ప్లాన్ కూడా అందుబాటులో ఉంది .ఇందులో మీరు ప్రతిరోజు 1.5 జిబి డేటా పొందుతారు.. అపరిమిత వాయిస్ కాలింగ్ 100 ఎస్ఎంఎస్ లు ప్రతిరోజు అందుకుంటారు.
ఇది కాకుండా రూ. 1299 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ప్రతిరోజూ మీరు 2 జిబి డేటా పొందుతారు.. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు ఉచితం ఇందులో మీరు ఫ్రీ నెట్ఫ్లిక్స్ మొబైల్ వర్షన్ కూడా ఉచితంగా పొందుతారు.