Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..

Sun, 19 May 2024-12:26 pm,

Jr NTR Assets: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు.

అంతేకాదు చిన్నపుడు తాత దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్ సినిమాలో బాల నటుడిగా భరతుడి పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ కాలేదు.

ఆ తర్వాత అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన రామాయణం మూవీతో వెండితెరపై తెరంగేట్రం చేసాడు. నిన్ను చూడాలిని మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.

మరోవైపు ఎన్టీఆర్‌కు జూబ్లీహిల్స్‌లోని ఇంటితో పాటు బెంగళూరులో రీసెంట్‌గా ఓ ఫామ్‌ హౌస్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. వీటి విలువ దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఇన్నేళ్ల కెరీర్‌లో తన పారితోషకం, వివిధ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు తారక్‌కు తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు, మామ నార్నే శ్రీనివాస్ నుంచి సంక్రమించిన ఆస్తులతోపాటు ఇంటివిలవను కలిపితే.. దాదాపు రూ.1200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అంతేకాదు తాత ఎన్టీఆర్ నుంచి నిమ్మకూరులో కూడా పలు ఆస్తులు కూడా ఎన్టీఆర్ వశం అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల నాన్న హరికృష్ణకు అక్కడ 5 ఎకరాల స్థలం వారసత్వంగా సంక్రమించింది. ఈ లెక్కన అక్కడ ఎన్టీఆర్కు అక్కడ రూ. 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link