Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..

Mon, 20 May 2024-8:20 am,

RRR (ఆర్ఆర్ఆర్)

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.

అరవింద సమేత వీరరాఘవ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

జై లవకుశ

ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

జనతా గ్యారేజ్

కొరటాల శివ దర్శకత్వంలో మోహన్‌లాల్ మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

నాన్నకు ప్రేమతో

సుకుమార్ దర్శకత్వంలో సున్నితమైన తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.

టెంపర్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా టెంపర్. తారక్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా తారక్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. అప్పటి నుంచి అపజయం ఎరగకుండా దూసుకుపోతున్నాడు.

బృందావనం

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'బృందావనం'. ఈ సినిమాలో తారక్ సరసన కాజల్ అగర్వాల్, సమంత కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

అదుర్స్

వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ద్విపాత్రాభియం చేసిన సినిమా 'అదుర్స్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

 

యమదొంగ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'యమదొంగ'. మోహన్ బాబు యమధర్మరాజుగా నటించిన ఈ మూవీ తారక్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

సింహాద్రి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సింహాద్రి'. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. తిరుగులేని మాస్ ఇమేజ్‌ ఈ సినిమాతో దక్కించుకున్నాడు.

ఆది

వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆది' మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. తొలిసారి మాస్ హీరోగా తారక్‌ను ఎస్టాబ్లిష్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

స్టూడెంట్ నెం. 1

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'స్టూడెంట్ నెం. 1. ఈ సినిమాతో తొలిసారి ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. దర్శకుడిగా రాజమౌళికి ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం.

రామాయణం జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా నటించిన  సినిమా 'రామాయణం'. యం.యస్.రెడ్డి నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link