Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!

Fri, 20 Sep 2024-7:10 am,

ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసాడు. అందులో చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాలేమిటో చూద్దాం.. త్వరలో తారక్.. దేవర్ మూవీతో పలకరించబోతున్నాడు.

ఆర్య.. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఆర్య’ కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. మరి ఈ రేంజ్ తనకు సూట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు నో చెప్పాడు. అది అల్లు అర్జున్ కెరీర్ నే ఛేంజ్ చేసింది.

దిల్.. నితిన్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్’. ఈ సినిమా కథ వినాయక్ ముందుగా ఎన్టీఆర్ కు చెప్పాడట. కానీ అప్పటికే ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఎన్టీఆర్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లింది. ఆ వెంటనే స్టూడెంట్ తరహా తనకు సూట్ కాదని ఈ మూవీని రిజెక్ట్ చేసాడట.

భద్ర..

వినాయక్ దగ్గర పనిచేసేటపుడే బోయపాటి శ్రీను భద్ర కథను ఎన్టీఆర్ కు చెప్పాడట. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా వినిపించాడట. చివరకు ఈ చిత్రాన్ని రవితేజతో తెరకెక్కించాడు. ఈ మూవీ ఏ రేంజ్ హిట్టో చెప్పాల్సిన పనిలేదు.

అతనొక్కడే..

కథను ఎన్టీఆర్ కు చెప్పాడు. ఆ తర్వాత ఈ స్టోరీ కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లి అతనికి హీరోగా, నిర్మాతగా ఈ చిత్రం నిలబెట్టింది.

కిక్.. అశోక్, అతిథి వంటి ప్లాప్ మూవీస్ తర్వాత వక్కంతం వంశీ ఇచ్చిన ‘కిక్’కథను సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కు వినిపించాడు. ఆ తర్వత ఏమైందో ఏమో ఈ స్టోరీ రవితేజ దగ్గరకు వెళ్లింది. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కృష్ణ..

దర్శకుడు వినాయక్ తో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టోరీని ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ఈ కథను యాక్సెప్ట్ చేయలేదు. రవితేజతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

శ్రీమంతుడు.. బృందావనం, దమ్ము సినిమాలకు కొరటాల శివ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్టీఆర్  కు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ముందుగా శ్రీమంతుడు కథను ఎన్టీఆర్ కు వినిపించాడు. కానీ తారక్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఊపిరి.. బృందావనం సినిమా తర్వాత నాగార్జున, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఊపిరి’ సినిమా అనౌన్స్ చేశారు. తీరా ఈ సినిమాలో నాగ్.. కాళ్లు పట్టుకునే సీన్స్ ఉండటం.. ఫ్యాన్స్ తో గొడవలు వస్తాయనే కారణంతో తారక్ ఈ  ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

రాజా ది గ్రేట్..

అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ సినిమాను ముందుగా తారక్ తో చేయాలనుకున్నాడు. దిల్ రాజు అంతా సెట్ అయింది. ఎన్టీఆర్ ఒద్దనడంతో ఆ తర్వాత రామ్ దగ్గరకు వచ్చింది. చివరి నిమిషంలో రవితేజ ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బ్రహ్మోత్సవం .. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా బ్రహ్మోత్సవం. ముందుగా ఈ సినిమా స్టోరీ ఎన్టీఆర్, రజినీకాంత్ లతో తెరకెక్కించాలనుకున్నాడు. తారక్ ఈ సినిమా స్టోరీ తనకు సెట్ కాదని సున్నితంగా తిరస్కరించాడు. రజినీకాంత్ పాత్ర సత్యరాజ్ దగ్గరకు వెళ్లింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link