Jr NTR: ‘దేవర’ తో ఎన్టీఆర్ ముందు పెద్ద సవాల్.. ప్యాన్ ఇండియా హీరోగా తారక్ సత్తా చాటేనా..!

Tue, 03 Sep 2024-12:59 pm,

ఎన్టీఆర్ ప్రెజెంట్  కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయినట్టు సమాచారం. కేవలం సెన్సార్ కు ఒక అడుగు దూరంలో ఉంది.  అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ‘దేవర’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే.

ఒక రకంగా ఎన్టీఆర్ కు ‘దేవర’ ఓ లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ ఒక్కడే ప్యాన్ ఇండియా స్టార్ గా స్థిర పడిపోయాడు. మన దేశంలో వన్ అండ్ ఓన్లీ హీరో ఒక్క ప్రభాస్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి ఎన్టీఆర్ కు ఎదురైంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి బ్రాండ్ సహా అన్ని కలిసొచ్చాయి. ‘దేవర’ మూవీతో ఎన్టీఆర్ ముందు అసలు పరీక్ష ముందుంది. అందుకే ఈ సినిమాకు ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం జాన్వీ కపూర్ తో పాటు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నాడు. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువ పాత్రలు చేస్తున్నట్టు సమాచారం.

 

పైగా రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ సెంటిమెంట్ ఒకటి ఉంది. దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎన్టీఆర్ ముందుంది. ‘దేవర’ ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.

అయితే.. ఎన్టీఆర్ కు ఇప్పటికే నార్త్ లో మంచి క్రేజ్ ఉంది.  జపాన్ లో కూడా తారక్ కు అభిమానులున్నారు. ఇక ప్యాన్ ఇండియా క్రేజ్ కోసం ఎన్టీఆర్ డైరెక్ట్ గా హిందీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హృతిక్ రోషన్ తో ‘వార్ 2’ మూవీ చేస్తున్నాడు. అటు బీ టౌన్ లో వరుసగా ఇతర హీరోలతో కలిసి  స్పై యూనివర్స్ సినిమాలు చేసేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు.

 

పైగా ‘దేవర’ మూవీతో ఎన్టీఆర్ హిట్ కొట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా.. రెండో పార్ట్ పై దాని ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కథ విషయంలో ఒకటి పది సార్లు చెక్ చేసుకొని ఈ సినిమా కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది

ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దేవర రూ. 110 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రూ. 150 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఆడియో రైట్స్ ను టి సిరీస్ దాదాపు రూ. 25 కోట్లుకు అమ్ముడుపోయినట్టు సమాచారం.  మరోవైపు శాటిలైట్ రైట్స్ ను దాదాపు రూ. 60 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 150 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఇక ఎన్టీఆర్ ‘టెంపర్’ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు వరుస హిట్లతో తెలుగులో ఏ హీరో లేనట్టుగా దూకుడు మీదున్నాడు. మరి ‘దేవర’తో హిట్ కొట్టడమే కాదు.. ప్యాన్ హీరోగా సత్తా చాటుతాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link