Devara OTT Streaming: ఇదెక్కడి మాస్ రచ్చరా మావ..ఇకపై ఆ విదేశీ భాషల్లో దేవర స్ట్రీమింగ్..
ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘దేవర’ సినిమా అక్కడ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
హిందీ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ విచిత్రంగా ఈ సినిమాకు సంబంధించి పలు విదేశీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. స్పానిష్, ఇంగ్లీష్, కొరియన్, బ్రెజిలియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఎన్టీఆర్ కు మన దేశంతో పాటు జపాన్ దేశంలో చాలా మంది అభిమానులున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్టీఆర్ చిత్రాలు ఎన్నో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ అక్కడ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అక్కడ 100 మిలియన్ యెన్స్ పైగా కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. దేవర సినిమాను త్వరలో జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అందుకే జపాన్ వెర్షన్ ను స్ట్రీమింగ్ కు రాలేదు.
ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ‘దేవర’తో అదే రేంజ్ సక్సెస్ అందుకోక పోయినా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో కుమ్మేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 180 కోట్ల షేర్.. (రూ. 350 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే కదా.
ప్రస్తుతం ఎన్టీఆర్.. వరుస సినిమాలు చేస్తున్నారు. హిందీలో హృతిక్ రోషన్ తో ‘వార్ 2’, దేవర పార్ట్ -2, ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ మూవీతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.