Jr NTR vs Ram Charan: జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్.. మొదటి ప్లేస్ ఎవరికంటే..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు.. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. కాగా మొదట్లో కొద్ది సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి స్టార్ హీరో అంటే సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పేవారు. ఆయన తరువాత నాగేశ్వరరావు, కృష్ణ పేర్లు వినిపించేవి. ఇక ఆ తరువాత తరం వారికి చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలుగా కొనసాగారు. కొద్ది సినిమాల ప్రభావంతో చిరంజీవి మొదటి స్థానం సంపాదించుకోగా.. బాలకృష్ణ రెండో స్థానంలో మిగిలిపోయారు. ఈ క్రమంలో ఈ తరంలో స్టార్ హీరో మొదటి స్థానం ఎవరిది అని ఎన్నో సంవత్సరాల నుంచి చర్చ సాగుతోంది.
మొదట్లో ఈ పోటీ..కేవలం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉండేది. కానీ పాన్ ఇండియా సినిమా వచ్చిన దగ్గరనుంచి.. ఈ లిస్టులో అందరికన్నా ముందు స్థానంలో దూసుకుపోయారు ప్రభాస్. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా ప్రభావం వల్ల.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కొద్దిగా కలెక్షన్స్ పరంగా వెనుకబడిపోయారు.
అయితే త్వరలోనే వీరిద్దరూ కూడా పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే.. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చిన దగ్గరనుంచి మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లో ఎవరు స్టార్ హీరో అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆ సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్ కి ఎక్కువ పాత్ర ఇచ్చారు అని అప్పట్లో వార్తలు కూడా కొనసాగాయి. కానీ అసలు విషయానికి వస్తే.. ఆ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎంతో హైలెట్గా నిలిచిన మాట వాస్తవం. కాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో గొప్ప అంటే.. రామ్ చరణ్ అభిమానులు తమ హీరోనే గొప్ప అని కామెంట్లు పెడుతున్నారు.
కానీ వీరిద్దరిలో స్టార్ హీరో ఎవరు అని చెప్పగలిగేది న్యూట్రల్ ఫాన్స్ మాత్రమే. ఇక వీరి అభిప్రాయానికి వస్తే.. న్యూట్రల్ ఫ్యాన్స్ ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్కె ఓటు వేయడం విశేషం. ఈమధ్య కొన్ని యూట్యూబ్ చానల్స్ సర్వేలు పెట్టగా.. వీటన్నిటిలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి
అయితే దీనికి కారణం లేకపోలేదు. రామ్ చరణ్ కెరియర్ లో అతను చూసిన ఓరిదుడుకులు.. అలానే అతను అందుకున్న బ్లాక్ బస్టర్లు.. జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే చాలా తక్కువే. ఎన్టీఆర్ వచ్చింది నందమూరి ఫ్యామిలీతోనే అయినా.. ఆ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కి పెద్దగా సపోర్ట్ దక్కలేదనే చెప్పాలి. తానే స్వయంగా కష్టపడి.. తన అద్భుతమైన నటనతో.. డాన్సులతో.. అంచలంచలుగా ఎదిగాడు ఈ యంగ్ టైగర్.
అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ ఎవ్వరూ చెప్పలేరని ఎంతోమంది సీనియర్ నటులు కూడా మెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటనకు.. కూడా ఎంతోమంది ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించే వారు ఉండొచ్చేమో కానీ.. ఆయన నటనను.. డైలాగ్ డెలివరీని విమర్శించేవారు మనకి కనిపించరు. జూనియర్ ఎన్టీఆర్ హవ భావాలు కూడా.. ఎంతో గొప్పగా ఉంటాయి.
ఇక ఇవన్నీ చూస్తే రామ్ చరణ్ కన్నా తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ కే మొదటి స్థానం అని.. హిందీలో రామ్ చరణ్ కి కొద్దిగా పాపులారిటీ ఉన్న.. తెలుగులో రామ్ చరణ్ కన్నా ఎన్నో సంవత్సరాల ముందే జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా కొనసాగారు అనేది ఎంతోమంది అభిమానుల వాదన. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్ హీరోలు తెలుగు ఇండస్ట్రీకి దక్కడం మాత్రం అదృష్టంగా భావిస్తున్నారు ఎంతోమంది.