Juice Jacking: బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో ఫోన్ లు చార్జీంగ్ పెడుతున్నారా..?.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు..
సమాజంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకప్పుడు ఫెస్ బుక్ లో అమ్మాయిలా నటించి అవతలి వారిని ట్రాప్ చేసి మోసాలకు పాల్పడేవారు. ఆ తర్వాత, వాట్సాప్ లకు లింక్ లను పంపి క్లిక్ చేయాలని మోసం చేసేవారు.
మరికొన్ని సంఘటనలలో లక్కీ డ్రా వచ్చిందని అది ఇవ్వాలంటే, కొంత డబ్బులు కట్టాలని కూడా వేధింపులకు గురిచేశారు. ఆ తర్వాత మీరు కార్ గెలుచుకున్నారు, కోటీశ్వరులయ్యారంటూ కూడా రకరకాలుగా మోసాలకు పాల్పడ్డారు. అదే విధంగా సోషల్ మీడియాలో ఒక ప్రాడక్ట్ చూపించి, రెట్టింపు డబ్బులు వసూలు చేశారు.
వాట్సాప్ లకు, ఫోన్ పేలకు లింగ్ లను పంపించి మోసాలకు పాల్పడ్డారు. ఏటీఎం నంబర్ ఎక్స్పైరీ అయిపోతుందని, బ్యాంక్ నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేయాలని కూడా మోసాలకు పాల్పడిన ఘటనలు కొకొల్లలు. పార్శీల్ వచ్చిందని ఓటీపీ చెప్పాలని కూడా మోసాలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, ఎయిర్ పోర్టులలో చార్జీంగ్ ఫ్రీ చార్జీంగ్ పాయింట్లు ఉంటాయి. మనలో చాలా మంది వీటిని ఉపయోగిస్తుంటారు. ఇక్కడ చార్జీంగ్ లు పెట్టుకుంటారు
ఇలాంటి ప్రదేశాలలో చార్జీంగ్ సాకెట్లలో సైబర్ నేరగాళ్ల మొబైల్ ఫోన్ లలో ప్రత్యేకంగా మాల్ వేర్ ను పంపిస్తారంట. ఇలా పంపిన తర్వాత ఫోన్ కంట్రోల్ అంతా వారి చేతిల్లోకి వెళ్లిపోతుంది. అంతేకాకుండా.. మనీయాప్ లు, బ్యాంక్ అకౌంట్ల పాస్ వర్డులను కూడా సైబర్ నేరగాళ్లు హ్యక్ చేస్తారంట.
అందుకే బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులలో ఫ్రీ చార్జీంగ్ పాయింట్ల వద్ద మొబైల్ ఫోన్ లు చార్జీంగ్ పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా బైట చార్జీంక్ కు బదులుగా పవర్ బాంక్ లను ఉపయోంచాలని సూచిస్తున్నారు.