Jupiter-Saturn Great Conjunction: 800 ఏళ్ల తర్వాత ఖగోళంలో అద్భుతం.. నేటి రాత్రి కనువిందు!
Jupiter Saturn Conjunction: ఖగోళంలో నేడు అద్భుతం జరగనుంది. వాస్తవానికి 2020లో మొత్తం 6 గ్రహణాలు ఉండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. ఈ ఏడాది చివరిదైన గ్రహణం.. రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం (డిసెంబర్ 21న) రాత్రి గురుగ్రహం (Jupiter), శని గ్రహాలు ఒకేచోటుకు రానున్నాయి.
ఖగోళంలో కొన్ని గ్రహాలు వందల ఏళ్లకు దగ్గరకు వస్తాయి. దీన్ని సంయోగం అని పిలుస్తారు. తాజాగా గురు గ్రహం, శనిగ్రహాలు అతి సమీపానికి రానున్నాయి. దీని మహా సంయోగం అంటారు. మిగతా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని ‘కలయిక’ చాలా అరుదుగా శతాబ్దాలకు ఓసారి సంభవిస్తుంది..
Also Read: Lakshmi Manchu Daughter Vidya Nirvana: మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత
నిపుణుల అభిప్రాయం ప్రకారం, 1623 తరువాత దాదాపు 400 ఏళ్ల అనంతరం ఆకాశంలో అలాంటి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. 2020 సంవత్సరంలో అతి చిన్నరోజున, అంటే నేడు (డిసెంబర్ 21న) ఈ సుందర దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే రాత్రివేళ ఇలా జరగడం మాత్రం సంభవించడం 800ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
భారతదేశంలో ఈ ఖగోళ అద్భుతం సాయంత్రం 6:30 నుండి రాత్రి వరకు 7:30 వరకు కనిపించనుంది. ఈ సమయంలో బృహస్పతి (గురుడు) గ్రహం శనిగ్రహం కన్నా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందుచేత శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియకు గ్రేట్ మహా కలయిక, మహా సంయోగం అని నామకరణం చేశారు.
Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?
గురు, శని గ్రహాలు నేడు అతి దగ్గరగా వచ్చినట్లు కనిపించినప్పటికీ.. మహా కలయిక సమయంలోనూ రెండు గ్రహాల మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. నేటి రాత్రి రెండు గ్రహాలు 0.06 డిగ్రీల మేర మాత్రమే ఎడంగా ఉండబోతున్నాయి.
ఈ రెండు గ్రహాలు 2080 మార్చి 15 సమయంలో మరోసారి దగ్గరికి రానున్నాయి. విదేశీయులు ఇలాంటి అద్భుతమైన ఖగోళ సంఘటన అంటారు. దీనిని క్రిస్మస్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు. బైనాక్యులర్లు మరియు ఇతర పరికరాల ద్వారా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షిస్తారు.
Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు