Worlds Shortest Woman Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు

Wed, 16 Dec 2020-8:59 am,

Worlds Shortest Woman Jyoti Amge Birthday: ప్రపంచంలో ఏదైనా సరే ఇతరులకు భిన్నంగా ఉండే రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. పొట్టి, పొడుగు విషయాలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన యువతి జ్యోతి కిసాంజి అమ్గే ఓ ప్రత్యేకతను సాధించారు. ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా జ్యోతి అమ్గే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. నేడు (డిసెంబర్ 16న) జ్యోతి అమ్గే పుట్టినరోజు.

Happy Birthday Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ భారత్‌కు చెందిన యువతి కావడం విశేషం. నేడు జ్యోతి అమ్గే 27వ పుట్టినరోజు (Jyoti Amge Birthday) వేడుకలు జరుపుకోనున్నారు. డిసెంబర్ 16న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జ్యోతి అమ్గే జన్మించారు.

Happy Birthday Jyoti Amge: అయిదేళ్ల వయసు వరకు జ్యోతి ఇతర చిన్నారుల్లానే సాధారణ ఎత్తు పెరిగిందని ఆమె తల్లి రంజన తెలిపారు. అయితే ఆ తరువాతే కూతురు జ్యోతి ఎత్తు పెరగడంలో సమస్య తలెత్తిందని గతంలో వెల్లడించారు.

అకాండ్రోప్లాసియా అనే సిండ్రోమ్ కారణంగా ఆమె ఎత్తు పెరగడం చిన్న వయసులోనే ఆగిపోయింది. జ్యోతి అమ్గే ఎత్తు 2 అడుగులు (62.80 సెంటీమీటలర్లు). ఇదే ఆమెకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చింది.

వరల్డ్ షార్టెస్ట్ వుమెన్ అయిన జ్యోతి కోసం అమ్గే దుస్తులు, నగలు, ఆమెకు సంబంధించిన పలు వస్తువులు, ఉత్పత్తులు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వాటినే ఆమె వినియోగిస్తారు.

అయిదేళ్ల వయసు వరకు జ్యోతి ఇతర చిన్నారుల్లానే సాధారణ ఎత్తు పెరిగిందని ఆమె తల్లి రంజన తెలిపారు. అయితే ఆ తరువాతే కూతురు జ్యోతి ఎత్తు పెరగడంలో సమస్య తలెత్తిందని గతంలో వెల్లడించారు.

Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!

ప్రపంచంలో జీవించి ఉన్న అతిచిన్న మహిళగా తమ కుమార్తె జ్యోతి అమ్గే రికార్డ్స్ క్రియేట్ చేయడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ కూతురు ఒత్తిడిని జయించి, సాధారణ జీవితం గడుపుతుందన్నారు. తల్లిదండ్రులు, కుటుంబం తనకు మద్దతుగా నిలిచిందని జ్యోతి అమ్గే చెబుతుంటారు.

అకాండ్రోప్లాసియా అనే సిండ్రోమ్ కారణంగా ఆమె ఎత్తు పెరగడం చిన్న వయసులోనే ఆగిపోయింది. జ్యోతి అమ్గే ఎత్తు 2 అడుగులు (62.80 సెంటీమీటలర్లు). ఇదే ఆమెకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చింది.

Gallery: Payal Rajput Photos: నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోస్

వరల్డ్ షార్టెస్ట్ వుమెన్ అయిన జ్యోతి కోసం అమ్గే దుస్తులు, నగలు, ఆమెకు సంబంధించిన పలు వస్తువులు, ఉత్పత్తులు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వాటినే ఆమె వినియోగిస్తారు.

అతిచిన్న మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పడంపై జ్యోతి అమ్గే ఎల్లప్పుడూ హర్షం వ్యక్తం చేస్తుంటారు. ఈ రికార్డు తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. గిన్నిస్ రికార్డ్ ద్వారా పాపులర్ అయ్యానని, కొందరికి ప్రత్యేకమైన వ్యక్తిగా నిలవగలిగానని జ్యోతి అంటున్నారు. టు ఫూట్ టాల్ టీన్.. అనే చానెల్ 4 డాకుమెంటరీ బాడీషాక్ ఎసిసోడ్‌లో పలు విషయాలు వెల్లడయ్యాయి. మికా సింగ్‌తో కలిసి ఓ వీడియో సాంగ్ సైతం చేయడం గమనార్హం. 

Also Read: Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link