Kajal Agarwal: హాట్ హాట్ గా కాజల్.. బ్లాక్ డ్రెస్సులో సత్యభామ అందాలు..

Thu, 06 Jun 2024-6:43 pm,

కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంది ఈ హీరోయిన్.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయమైన కాజల్ అగర్వాల్ కి.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. చందమామ సినిమా దగ్గర నుంచి ఇప్పుడు రాబోయే సత్యభామ సినిమా వరకు.. ప్రతి సినిమాలో తన నటనను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చింది ఈ హీరోయిన్.

సత్యభామ సినిమా ఈవారం విడుదలకు సిద్ధమవుతూ ఉండటంతో.. ఈ చిత్ర ప్రమోషన్స్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు కాజల్. కాదా ఈ సినిమాలో ఈ హీరోయిన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది.

ఈ సినిమా కానీ విజయం సాధిస్తే.. కాజల్ కి మరిన్ని ఫిమేల్ ఓరియంటడ్ సినిమాలు రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ చిత్రంలోనే కాకుండా త్వరలోనే ఇండియన్ 3 చిత్రంలో కూడా కాజల్ కనిపించనుంది.

ఇక సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కాజల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు కాజల్ బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానుల మనసులను బ్లాక్ చేసి పడేస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link