Kajal Agarwal: ఎర్ర మిరపకాయల కాజల్.. చూస్తే మతిపోవాల్సిందే!

Sat, 06 Apr 2024-6:00 pm,

కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మధిలో చందమామ గానే నిలిచిపోయింది.

అప్పటినుంచి వరస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోస్ తో పాటు టైర్ 2 హీరోస్ తో కూడా నటించి మెప్పించింది కాజల్.

కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో పెళ్లి చేసుకొని 2022 ఏప్రిల్ 19న మ‌గ‌బిడ్డ కి జన్మనిచ్చింది.

ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన కాజల్ ఈమధ్య బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కనిపించి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

త్వరలోనే సత్యభామ, ఇండియన్ 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో కాజల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకర్షిస్తున్నాయి. ఎరుపు రంగు దుస్తులో రెడ్ చిల్లిలా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link