Kajal Agarwal: స్టైలిష్ డ్రెస్సులు మైమరిపిస్తున్న కాజల్.. ఫిదా అవుతున్న అభిమానులు

Sat, 16 Mar 2024-8:56 pm,

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో నిజంగానే చందమామల తెలుగు ప్రేక్షకులకు కనిపించి మెప్పించింది.

ఆ తరువాత మగధీరా లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఈ హీరోయిన్ కి తెలుగు ఇండస్ట్రీలో అద్దు లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా దాదాపు అందరూ హీరోలతోనూ నటించింది.

తెలుగులోనే కాక సౌత్ లో ఇతర భాషల్లో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది కాజల్. ముఖ్యంగా తెలుగు తమిళంలో కాజల్ అగర్వాల్ కి అభిమానులు ఎక్కువే.

ఇక ఈ పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్ కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే మరల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం సూపర్ సక్సెస్ సాధించింది ఈ హీరోయిన్.

త్వరలోనే సత్యభామ చిత్రంలో అలానే కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్న కాజల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఎల్లప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. 

ముఖ్యంగా ఈ మధ్య ఈ హీరోయిన్ బ్లాక్ కోట్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ మెప్పిస్తూ.. కాజల్ మరలా వెండితెరపై ఎప్పుడు చూస్తామో అని తెగ ఎదురుచూసేలా చేస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link