Kajal Aggarwal look in Kannappa: కన్నప్పలో పార్వతి మాత పాత్రలో కాజల్ అగర్వాల్.. జ్ఞాన ప్రసూరాంబికగా అదిరిన లుక్..

Mon, 06 Jan 2025-12:32 pm,

Kajal Aggarwal as parvathi matha in Kannappa: మంచు విష్ణు టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న భారీ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. శ్రీకాళమస్తిశ్వర స్వామి భక్తుడిగా కన్నప్ప గొప్పదనాన్ని ప్యాన్ ఇండియా ప్రేక్షకులు తెలిసేలా మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ స్టార్ క్యాస్ట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో నటిస్తున్నారు.

 

అటు ప్రభాస్ నంది పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కానీ క్లారిటీ లేదు. మోహన్ లాల్ ఈ సినిమా కిరాత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీకాళహస్తికి సంబంధించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక పాత్రలో నటిస్తోంది.

అద్భుతమైన స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుంది. క‌న్న‌ప్ప‌లో మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసారు.

ఆ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్‌ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. కన్నప్పను ముప్పతిప్పలు పెట్టే పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్స్ లో  చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ముందుగా గతేడాది విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఏప్రిల్ 25న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link