Kajal Aggarwal: పెళ్లి తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచిన కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తూ మైండ్ బ్లాంకే..
తెలుగు వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.
తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది కాజల్ అగర్వాల్.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్. ఇందులో మిత్రవింద ఈమె గ్లామర్ కమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.
మ్యారేజ్‌కు ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇపుడు అదే జోరు చూపిస్తోంది. అంతేకాదు వరుస ఫోటో షూట్స్‌తో ఎక్కడా తగ్గడం లేదు.
గతేడాది 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్..