Kajal Aggarwal: ఆ హీరో కోసమే అలాంటి పని చేశాను.. కాజల్ ఓపెన్ కామెంట్స్..
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోంది. అంతేకాదు పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తన గ్లామర్‌తో అలరిస్తూనే ఉంది.
కాజల్ అగర్వాల్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా జనతా గ్యారేజ్‌లో తొలిసారి ఐటెం భామగా అలరించింది. అందులో ఈ పాట చేయడానికి కారణాలు వెల్లడించింది.
ఎన్టీఆర్ తనకు మంచి స్నేహితుడు. అంతకు ముందు తారక్‌తో బాద్‌షా, బృందావనం, టెంపర్ వంటి సినిమాల్లో నటించాను. ఆ సినిమాలతో మా మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.
తారక్ అడిగినందుకే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని కాజల్ అగర్వాల్ ప్రస్తావించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయమని అడిగినా.. చేయలేదన్నారు.
కాజల్ అగర్వాల్.. లాస్ట్ ఇయర్ బాలకృష్ణతో కలిసి 'భగవంత్ కేసరి' సినిమా చేసారు. త్వరలో NBK 104 సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.
త్వరలో కాజల్ అగర్వాల్ 'సత్యభామ' సినిమాతో పలకరించనుంది. ఈ సినిమాపై కాజల్ అగర్వాల్ భారీ ఆశలే పెట్టుకుంది.