Sapthami gowda: పెళ్లైన హీరోతో కాంతారా బ్యూటీ అక్రమ సంబంధం..?.. కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ..
కన్నడ ఇండస్ట్రీలో ఇటీవల వివాహేతర సంబంధాలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇప్పటికే హరో దర్శన్, పవిత్ర గౌడలో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారనే రచ్చనడుస్తోంది. ఈక్రమంలో వీరు రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించారనే దానిపై విచారణ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో కన్నడను కుదిపేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాంతారా ఫెమ్.. సప్తమి గౌడ..కన్నడ నటుడు యువరాజ్ కుమార్ తో ఎఫైర్ ఉందని ఆయన సతీమణి ఆరోపించింది. ఇటీవల భార్యభర్తలు మధ్య గొడవలు వచ్చాయి.
దీంతో డైవర్స్ తీసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ తన భార్యశ్రీదేవికి ఇతరులతో ఎఫైర్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా.. ఆమె తన భర్త కాంతారా నటి సప్తమి గౌడతో వివాహేతర సంబంధం ఉందని బాంబు పేల్చింది.
సప్తమి గౌడ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని శ్రీదేవీ ఆరోపణలు చేసింది. ఆమె కోసమే తనను భర్త వదిలించుకునేందుకు చూస్తున్నాడని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
దీనిపై కాంతారా బ్యూటీ సప్తమి గౌడ స్పందించారు. దీనిపై శ్రీదేవిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబం పరువు బైటకు పోవద్దనే ఓపికతో భరించానని, కానీ శ్రీదేవీ ఆరోపణలు ఎక్కువకావడం వల్ల ఆమె లాయర్ తో కోర్టులో దావా వేశారు.
ఈ నేపథ్యంలో వీరి గోడవల్లో తన పేరును ప్రస్తావించడంను సప్తమి గౌడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తున్న నేపథ్యలో ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయోద్దంటూ కూడా కోర్టు శ్రీదేవీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన మాత్రం కన్నడ ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారింది.