Dhoti wearing incident: అట్లుంటదీ రైతన్నతో పెట్టుకుంటే.. మాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సర్కారు.. డిటెయిల్స్ ఇవే..
దేశానికి అన్నంపెట్టేవాడు రైతన్న. తాను కడుపు నిండా తినకున్న కూడా.. ప్రజల కడుపు నింపుతాడు. ఆరుకాలం కష్టపడి పంటలు పండిస్తాడు. కొన్నిసార్లు పంటలు పండకుండా.. నష్టపోయిన వెనక్కు తగ్గకుండా రైతన్న పంటలు పండిస్తుంటారు. నెల తల్లిని, పంటలను నమ్ముకుని పంటను పండిస్తుంటాడు. ఇలాంటి రైతన్నకు బెంగళూరులో జరిగిన ఘోర అవమానం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.
కర్ణాటకలోని బెంగళూరులో ఇటీవల దారుణ ఘటన జరిగింది. ఒక రైతన్న.. ధోతీ ధరించాడని మాల్ సిబ్బంది లోనికి రానివ్వలేదు. ధోతి ఉంటే రానివ్వమని, ప్యాంట్ వేసుకొవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్గా మారింది.
దీనిపైన స్థానికులతో పాటు, అపోసిషన్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా నిరసనలు తెలియజేశారు. ఏకంగా మాల్ ముందు కూర్చుని వెంటనే చర్యలు తీసుకొవాలంటూ, రైతుకు సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతు సంఘాల నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ధోతీ అనేది మన భారతదేశ సంప్రదాయ దుస్తుల్లో ఒకటి. కానీ ఇప్పుడు చాలా మంది జీన్స్, టీ షర్ట్ లు ధరిస్తున్నారు.
నార్మల్ గా పొలం పనులకు వెళ్లేవారంతా.. తెల్లని ధోతీలు ధరిస్తుంటారు. ఊర్లలో మనం తరచుగా చూస్తునే ఉంటాం. ఇప్పటికి కూడా వాళ్లు ధోతీలు మాత్రమే ధరించి ఉంటారు. ఈ నేపథ్యంలో మాల్ ను చూడాలన్పించిన ఒక రైతు, తన కొడుకుతో కలిసి ధోతీ మీద వెళ్లాడు. కానీ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మాల్ లోపలికి వెళ్లకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అదేంటని అడగ్గా.. ధోతీలు ఉన్న వారిని షాపింగ్ మాల్ లోకి అనుమతించమని తేల్చి చెప్పారు.
ధోతీ కట్టుకుని వచ్చినవారిని లోపలికి పంపించవద్దని మాల్ యాజమాన్యం తమకు ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బంది వెల్లడించారు. కేవలం ప్యాంట్లు ధరించిన వారిని మాత్రమే అనుమతించాలని తమకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో వారిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
రైతుకు న్యాయం జరక్కపోతే... వేలాదిగా నిరసనలు తెలియజేస్తామంటూ కూడా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.దీంతో మాల్ సిబ్బంది దిగివచ్చారు. సదరు రైతుకు క్షమాపణలు తెలిపారు. అయిన కూడా ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య సీరియస్ గా స్పందించింది. ఏడు రోజుల పాటు జీటీ మాల్ ను క్లోజ్ చేసి ఉంచాలని ఆదేశించింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న పట్ల ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఇదిలా ఉండగా.. గతంలో బెంగళూరులోనే రైతును అవమానించిన ఘటనను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం నెత్తిన ఓ సంచి పెట్టుకుని.. బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లిన ఓ రైతుకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అక్కడి సిబ్బంది కూడా.. రైతు దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతించలేదు. అప్పుడు బెంగళూరు మెట్రోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు అధికారులు దిగోచ్చి క్షమాపణలు తెలిపారు.