Karthika Masam 2024: కార్తీక మాసంలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఇవే..!
కార్తీక మాసం మరో 4 రోజులలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కళ్యాణ ఘడియలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో చాలామంది పెద్దవాళ్లు తమ ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిలకు పెళ్లిళ్లు కుదర్చడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అధిక సంఖ్యలో వివాహ ముహూర్తాలకు తేదీలు ఖరార్ అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మొదలైందని చెప్పవచ్చు
ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన కన్వెన్షన్లు, కళ్యాణ మందిరాలు, గార్డెన్స్, దేవాలయాలు కళకళలాడనున్నాయి.
కార్తీక మాసం నవంబర్ 1 నుంచి మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో వివాహాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారుగా ఒక్కో వివాహానికి ఎంత లేదన్నా రూ.10 నుండి రూ.15 లక్షల ఖర్చు అవుతుందనటంలో సందేహం లేదు.
అంతేకాదు కోట్ల రూపాయల ఖర్చు చేసే అతిరథ మహారధులు కూడా ఉన్నారు. ఎవరికి వారు తమ తాహతకు తగ్గట్టుగా వివాహాలు జరిపించబోతున్నారు. మరి ఈ కార్తీకమాసంలో పెళ్లిళ్లకు అనువుగా ఉండే తేదీల విషయానికి..వస్తే..12,13,17,18,22,23,25,25,28,29, డిసెంబర్ నెలలో 4,5,9,10,11,14,15,16 వ తేదీలు శుభ్రమైన రోజులుగా పండితులు చెబుతున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే ఈ తేదీలు చూసుకొని ప్రారంభించవచ్చు.