Karthika Somavaram: కార్తీక మాసం.. సోమవారం శివుడ్ని ఇలా పూజిస్తే అఖండ ధనయోగంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారంటీ..
కార్తీకమాసం అన్ని మాసాల కన్నా కూడా గొప్పదైనదని చెప్తుంటారు. ఈ మాసంలో మనం గోరంత పుణ్యం చేసిన కూడా అది కొండంత మంచి ఫలితాలు ఇస్తుందని పండితులు చెప్తుంటారు.
ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం, శుక్రవారం, శనివారాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతుంటారు. అందుకే సోమవారం నాడు చాలా మంది వ్రతాలుసైతం ఆచరిస్తారు.
సోమవారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆతర్వాత శుభ్రమైన బట్టలు ధరించి పూజలు చేయాలి. ఆలయంలో లేదా ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకొవాలి.
శివుడు అభిషేకం చేస్తే మన కోరికలుఅన్ని నెరవేరుస్తుంటాడు. అందుకే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పదార్థాలతో శివుడికి అభిషేకం చేయాలి. వివిధ రకాల పండ్లతో కూడా అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కల్గుతాయి.
అంతే కాకుండా చాలా మంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఉపవాసం చేస్తారు. ఇలా ఉపవాసాలు ఉండి, శివుడ్ని ధ్యానిస్తు ఉంటే మనం తెలిసి, తెలియక చేసిన కర్మలన్ని దూరమౌతాయి. కార్తీక మాసంలో సోమవారంనాడు పెద్దగా పూజలు లేదా అభిషేకాలు చేసే సమయం లేకపోతే.. చెంబు నిండా శుభ్రమైన నీళ్లు శివుడి మీద పోసి శివయ్యను మనసారా ధ్యానించాలి.
ఆ తర్వాత బిల్వపత్రిదళాలను శివయ్యకు సమర్పించుకొవాలి. తోచిన నైవేద్యం చక్కెర లేదా ఏదైన ఫలం అర్పించుకొవాలి. ఇలా చేస్తే శివయ్య అనుగ్రహాంతో జీవితంలో ధనయోగంతో పాటు జాబ్ లో ప్రమోషన్ లు కూడా వస్తాయని పండితులు చెబుతుంటారు.