Karthika masam 2024: కార్తీక మాసంలో తులసీ వివాహాం ఎప్పుడు?.. దీని విశిష్టత.. తులసీ పెళ్లి చేస్తే ఎలాంటి ఫలితాలు కల్గుతాయో తెలుసా..?
హిందు పురాణాల ప్రకారం విష్ణుభగవానుడు ఆషాడ మాసంలోని ఏకాదశికి నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలోని ఏకాదశికి నిద్రనుంచి మేల్కొంటారంట. అందుకే ఈ నాలుగు మాసాలలో కూడా భక్తులు చాతుర్మాస్య వ్రతంను ఆచరిస్తారు.
చాతుర్మస్య వ్రతంను ఒక్కొరు ఒక్కొ విధంగా ఆచరిస్తారు. కొంత మంది ఏక భూక్తం, మరికొందరు కేవలం ఫలాలు తిని ఉపవాసాలు చేస్తుంటారు. ఇంకొందరు ఈ నాలుగు నెలలలో తమకు ఇష్టమైన పదార్థాలను సైతం త్యాగం చేస్తుంటారు.
అయితే.. ప్రస్తుతం కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. ఈ నెల రోజుల పాటు చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత పుణ్యమని చెప్తుంటారు. మిగతా మాసాలకన్నా.. కార్తీక మాసంలో ఏ పూజలు చేసిన, వ్రతాలు ఆచరించిన కూడా అది రెట్టింపు ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతుంటారు.
ప్రస్తుతం కార్తీక మాసం నవంబరు 2 నుంచి ప్రారంభమై డిసెంబరు 1 వరకు ఉంది. అయితే.. ప్రస్తుతం చాలా మంది కార్తీక మాసంలో విష్ణువును, శివుడ్ని భక్తితో పూజిస్తుంటారు. ఈ నెల రోజులు కూడా శివకేశవులకు ఎంతో ప్రీతికరమైందని చెప్పుకొవచ్చు.
ఈ క్రమంలో నవంబర్ 13న ఈసారి ద్వాదశిని జరుపుకుంటాం. ఈ రోజున చాలా మంది తులసీ వివాహాం చేస్తారు. సాలగ్రామంను పండితులకు దానంగా ఇస్తారు. ముఖ్యంగా పెళ్లి కానీ వాళ్లు.. ఈ రోజున సాయత్రం పూట తులసీ గద్దె దగ్గర, విష్ణువు ప్రతిమను ఉంచి పండితుడు చెప్పిన విధంగా తులసీ పెళ్లిని నిర్వహించాలి.
ఇలా చేయిస్తే.. వివాహాంలో ఆటంకాలు వస్తే అవన్ని కూడా దూరమౌతాయని పండితులు చెప్తుంటారు. ఈ రోజున ఉసిరి పండ్ల మీద దీపం వెలిగించి దీపదానం చేయాలి. అంతే కాకుండా.. శివుడికి, కేశవుల ఆలయాలలో వెళ్లి నెయ్యితో దీపారాధన చేస్తే.. మనకు ఎదురౌతున్న అనేక సమస్యలు, గ్రహా బాధలు పోతాయని పండితులు చెప్తుంటారు.