IPL 2025 Season: ఐపీఎల్ 2025పై కావ్య మారన్ భారీ ఆలోచనలు.. రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే!
Sunrisers Hyderabad Retain Players: గత వేలంలో పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి చాలా మంది కీలక ఆటగాళ్లను హైదరాబాద్ ఎంచుకుంది. ఆ జట్టుతో 2024 సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. 2025 సీజన్‌లో ఇదే పునరావృతం చేయాలనే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉంది.
Sunrisers Hyderabad Retain Players: గత 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో బీభత్సం.. క్లాసన్ తిరుగులేని మిడిలార్డర్ బ్యాటింగ్, పాట్ కమిన్స్ సారథ్యంతో జట్టు అద్భుతంగా రాణించింది.
Sunrisers Hyderabad Retain Players: సన్‌రైజర్స్ గత చిన్న వేలంలో కీలక ఆటగాళ్లను తీసుకోగా.. ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలనే నిబంధనలు ఇంకా తెలియరాలేదు. అయితే రిటైన్ చేసుకునేవారిపై సన్‌రైజర్స్ ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
Sunrisers Hyderabad Retain Players: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 4 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించవచ్చనే సమాచారం. 2 ఆర్టీఎం కార్డులను కూడా వేలంలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్లు, భారత ఆటగాళ్లు ఎవరైనా 4 ఆటగాళ్లను ఎలాంటి పరిమితి లేకుండా అట్టిపెట్టుకోవచ్చని తెలుస్తోంది. దీని ప్రకారమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ఏ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటారనేది ఆసక్తికరం.
Sunrisers Hyderabad Retain Players: ట్రావిస్ హెడ్: వరుసగా రికార్డులను బద్దలు కొట్టిన ఆటగాడు ట్రావిస్ హెడ్. బ్యాటింగ్‌తో దుమ్ముదులపడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను హెడ్ నెలకొల్పాడు. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్‌గా రఫ్పాడిస్తున్న హెడ్ తప్పనిసరిగా నిలుపుకోవచ్చు.
Sunrisers Hyderabad Retain Players: ప్యాట్ కమిన్స్: జట్టుకు అద్భుతంగా సారథ్యం వహిస్తూనే బ్యాటింగ్, బౌలింగ్‌లో కమిన్స్ రాణిస్తున్నాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ హైదరాబాద్‌కు చాలా ముఖ్యం. దీంతో కమిన్స్‌ను వదలుకునే ప్రసక్తే లేదు. 2025 సీజన్‌కు కూడా కమిన్స్ కెప్టెన్సీ కొనసాగించనున్నట్లు సమాచారం.
Sunrisers Hyderabad Retain Players: హెన్రిచ్ క్లాసెన్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఆటగాడు. సిక్సర్ల వీరుడిగా ఉన్న క్లాసెన్‌ను హైదరాబాద్ జట్టు వదులుకోలేదు. తప్పనిసరిగా వచ్చే సీజన్‌కు అట్టిపెట్టుకోనుంది. మిడిలార్డర్‌లో సత్తా చాటగల ఆటగాడు క్లాసెన్.
Sunrisers Hyderabad Retain Players: అభిషేక్ శర్మ: తెలంగాణ పోరడు అభిషేక్ శర్మ బ్యాట్‌తో బంతి చితక్కొడుతున్నాడు. సీనియర్లకు పోటీగా పరుగులు రాబడుతూ గత సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. కుర్ర ఆటగాడిని హైదరాబాద్ వదులుకునే ప్రసక్తే లేదు. ట్రావిస్ హెడ్‌తో కలిసి బ్యాట్‌తో ప్రత్యర్థులను భయపెట్టిస్తున్నాడు. 2025 సీజన్‌లో అభిషేక్‌ను కావ్య మారన్ వదిలిపెట్టదు.
Sunrisers Hyderabad Retain Players: ఈ నలుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంటే.. ఆర్‌టీఎం ద్వారా మెగా వేలంలో నటరాజన్, నితీష్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్‌లతో సహా ఇద్దరు ఆటగాళ్లను తిరిగి ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి.