Kavya Thapar: డబుల్ ఇస్మార్ట్ మూవీలో అందాల హద్దులు చెరిపేసిన కావ్య థాపర్.. అమ్మడి కెరీర్ ఛేంజ్ అయ్యేనా..

Mon, 05 Aug 2024-10:44 am,

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ ఇయర్ మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సందీప్ కిషన్.. ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో తన ఖాతాలతో పెద్ద హిట్ అందుకుంది. 

కావ్య థాపర్.. తెలుగులో  'ఈ మాయ ప్రేమతో' మూవీతో  పరియయం  అయింది. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అందులో ఈ భామ అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది  ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈ చిత్రంలో కావ్య గ్లామర్ కు  ఆడియన్స్  ఫిదా అయ్యారు.

కావ్య థాపర్ తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి యూత్ కు నిద్ర లేకుండా చేసింది.  

  కావ్య థాఫర్ హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’ మూవీతో పరిచయమైన.. ఆ తర్వాత  'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ  పెద్దగా వర్కౌట్ కాలేదు.

లాస్ట్ ఇయర్ కావ్య.. విజయ్ ఆంటోని నటించిన ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను  అందుకుంది.

త్వరలో ఆగష్టు 15న రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో కథానాయికగా కావ్యకు  బ్రేక్ లభిస్తుందా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link