KCR Action Plan: టీఆర్ఎస్ భవన్ లో సర్కార్ నేతల సమావేశం.. యాక్షన్ ప్లాన్ రెడీ!
ఈ సమావేశానికి సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్‌లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మెన్‌లు సమావేశానికి హాజరయ్యారు.
వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన, ధర్నాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం తరువాత సీఎం, మంత్రులు కలిసి ఢిల్లీ బయలుదేరనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు.
తెలంగాణలో యాసంగిలో పండిన 50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సింది ఉండగా.. వానాకాలానికి సంబంధించిన 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా నిల్వ ఉంది
తెలంగాణ భవన్‌లో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ ఇతర అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.