Keerthy Suresh: సంప్రదాయ చీరకట్టులో మహానటి కీర్తి సురేష్ కిర్రాక్ ఫోజులు..
కీర్తి సురేష్ ..తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ చిత్రంలో బుజ్జి కారుకు తన గొంతుతో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కారు క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెంట్ ఉండటం విశేషం. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
కీర్తి సురేశ్.. ముందుగా తన మాతృ భాష మలయాళంలో తెరకెక్కిన 'గీతాంజలి'మూవీతో కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైంది.మలయాళం తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తెలుగులో 'నేను శైలజా' మూవీతో పరిచయమైంది. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ సరసన నటించింది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు. ఈ చిత్రంలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఈ భామను వరించింది.
ఇప్పటి వరకు సౌత్ లో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్.. త్వరలో 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.