Keerthy Suresh: కీర్తి సురేష్ కాబోయే వాడు ఇతడేనా.. బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఉందిగా..
కీర్తి.. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ చిత్రంలో బుజ్జి కారుకు తన గొంతుతో మంచి క్రేజ్ తీసుకొచ్చింది కీర్తి సురేశ్. ఈ చిత్రంలో కారు పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉండటం విశేషం.
కీర్తి సురేష్ బాలనటి.. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తన మాతృ భాష మలయాళంలో తెరకెక్కిన 'గీతాంజలి'మూవీతో కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైంది.
మలయాళం తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' చిత్రంతో పరిచయమైంది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ యాక్టింగ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. తెలుగులో 'నేను శైలజా' మూవీతో పరిచయమైంది. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యింది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ నటించిన విధానం ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకొచ్చింది.
కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈమె పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమె ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా అతనితో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తోందట. డిసెంబర్ 11 మరియు 12 తేదిల్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు వీరిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయంలోనే జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతనికి కేరళలో పలు బిజినెస్ లు ఉన్నాయట. దాదాపు రూ. 500 కోట్ల వరకు ఆస్తులున్నట్టు సమాచారం.