Keerthy Suresh Photos: పొట్టి గౌనులో కీర్తి సురేష్ అందాల విందు.. హీటెక్కిస్తోందిగా!
అలనాటి నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ఆమె నేను లోకల్ మహానటి వంటి సినిమాలతో స్టార్ క్రేజ్ దక్కించుకుంది.
అయితే ఆ తర్వాత ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ చేసుకుంటూ వెళుతూ ఉండడంతో దాదాపు ఆ సినిమాలన్నీ డిజాస్టర్ గా మారుతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆమె గ్లామర్ పాత్రలు కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సర్కారు వారి పాట సినిమా నుంచి గ్లామర్ కంచ చెరిపేసి తాను గ్లామరస్ రోల్స్ కి కూడా సై అంటున్నట్టు సిగ్నల్స్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమెకు వరుస సినిమా అవకాశాలైతే లభిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఆమె మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఆమె సరసన సుశాంత్ నటిస్తున్నాడు.
తాజాగా ఒక పార్టీకి వెళుతున్న కీర్తి సురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో చాలా చిన్న గౌనులో ఆమె దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆ పార్టీకి హాజరైన కొందరితో తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసేయండి.