Raveena Tandon: పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ప్రధాన మంత్రి.. స్టిల్స్ అదిరాయిగా!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రవీనా టాండన్.. తాజాగా పింక్ డ్రెస్‌లో ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో రవీనా టాండన్ కీలక పాత్ర చేశారు. ప్రధాన మంత్రి రమిక సేన్ పాత్రలో అదరగొట్టారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో తన బుజ్జి మనవడితో రవీనా సరదాగా గడిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబందించిన పోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
రవీనాది చాలా గొప్ప మనసు. 1995లో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇక 2004లో అనిల్ తడానీతో పెళ్లైన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
తెలుగులో రథ సారధి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు రవీనా టాండన్ చేశారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా రవీనా టాండన్ సుపరిచితురాలే. నాగార్జున, బాలక్రిష్ణ, మోహన్ బాబులతో ఆమె జతకట్టారు. మంచు ఫామిలీ నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో రవీనా కామెడీతో అలరించారు.
రవీనా టాండన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. తన అందం, నటనతో అందరిని ఆకట్టుకున్నారు.