Khushbu: చెప్పుతో కొడతా... సినిమా సెట్స్ లో హీరోకు ఇచ్చిపడేసిన నటి ఖుష్బూ... అసలేం జరిగిందంటే..?

Fri, 22 Nov 2024-4:57 pm,

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందనే వార్తలు ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మళయాల ఇండస్ట్రీలో హేమ కమిటీ బైట పెట్టిన రిపోర్ట్ చూసి అందరు షాక్ అవుతున్నారు.  

ఈ క్రమంలో బైటి వాళ్లు మాత్రం రంగు రంగుల లోకం, అందమైన మేకప్ ల వెనుకాల.. ఇంతటి నీచమైన పనులు చేస్తారా.. అని ఆశ్చర్యపోతున్నారంట. ఈ నేపథ్యంలో చాలా మంది ఇటీవల మీటూ.. అంటూ తమకు ఎదురైన వేధింపులపై ఓపెన్ అవుతున్నారు.

తాజాగా, నటి ఖుష్బూ గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్పీ)లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తనకు తొలినాళ్లలో ఎదురైన ఒక షాకింగ్ ఘటన గురించి షాకింగ్ నిజం బైటపెట్టారు.  

గతంలో ఒక షూటింగ్ జరిగే సమయంలో.. తనకు అందరి ముందే ఏదైన చాన్స్ ఉందా.. అని అడిగారంట.. దీనికి నటి  ఖుష్బూ తన చెప్పుసైజు 41.. ఇక్కడ కొట్టాలా.. సెట్లో అందరి ముందు కొట్టాలా.. అని ఫైర్ అయ్యిందంట.  

దీంతో అతగాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడంట. ఈ క్రమంలో మహిళలు తమ ఆత్మగౌరవంకు భంగం కలిగేలా ఎలాంటి ఘటనలు ఎదురైన.. దానికి కౌంటర్ గా రియాక్ట్ అవ్వాలని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నటి  ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇండస్ట్రీలో కాకరేపుతున్నాయి. ఆ హీరో ఎవరంటూ కూడా అనేక రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా.. వేధింపుల విషయంపై.. ఇప్పీలో జరిగిన చర్చలో ఖుష్బూ, సుహాసినీ, ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొని తమ అనుభవాల్ని పంచుకున్నట్లు తెలుస్తొంది. మహిళలు వేధింపుల్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటు ముందుకు వెళ్లాలని కూడా సూచించారు.. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link