Kia Clavis: మార్కెట్‌లో మరో పవర్‌ ఫుల్‌ SUV వచ్చేస్తోంది.. Kia Clavis సంచలనం సృష్టించబోతోందా?

Tue, 19 Mar 2024-6:18 pm,

క్లావిస్ SUV కారును కియా స్పోర్టీ లుక్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆకర్శనీయమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీని ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, డే-టైమ్ రన్నింగ్ లైట్‌లు కలిగి ఉంటుంది. వెనుక భాగంలో LED టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఒక రూఫ్ స్పాయిలర్  కూడా కలిగి ఉంటుంది. 

క్లావిస్ SUV రెండు ఇంజన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో మొదటిది మోడల్‌ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తే రెండవది  1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో రాబోతోంది.

టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 PS శక్తినితో పాటు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని లీక్‌ అయిన వివరాల్లో పేర్కొన్నారు. ఇక డీజిల్ ఇంజన్ మాత్రం.. 115 PS శక్తి, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

  క్లావిస్ SUV అనేక ఫీచర్స్‌తో అందుబాటులో రాబోతోంది. వీటిలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.

క్లావిస్ SUV సేఫ్టీ విషయానికొస్తే, ఇది ఆరు ఎయిర్‌బ్యాగులతో పాటు ABS తో EBD, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్ సపోర్ట్‌ కూడా లభిస్తుంది.  

క్లావిస్ SUV కారను లోపలి భాగం చాలా విశాలంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు ప్రయాణికులు కూడా  సౌకర్యవంతంగా ప్రయాణం చేయోచ్చు.

క్లావిస్ SUV 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ 17 kmpl మైలేజ్‌ను ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 20 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link