Nonstick Pans: ఏయే ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్ లో వండకూడదో తెలుసా
ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కువ హీట్‌లో వండాల్సిన ఏ ఆహార పదార్ధాన్నీ నాన్‌స్టిక్‌లో వండకూడదు. వీలైనంతవరకూ తక్కువ హీట్ అవసరమయ్యే ఆహార పదార్ధాల్నే వండాలి.
మాంసం వంటి వస్తువుల్ని వండేందుకు పాన్‌ను ముందుగా హీట్ చేస్తుంటాం. లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది.
ఎక్కువ సేపు వండే వెజిటబుల్ ఫ్రై పదార్ధాల్ని కూడా నాన్‌స్టిక్‌లో వండకూడదు. ఎక్కువ టెంపరేచర్‌తో వండే పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకూడదు. నాన్‌స్టిక్ కోటింగ్ కరగకుండా జాగ్రత్త పడాలి.
సాస్, సూప్, మాంసం, పాయసం వంటి ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకపోవడమే మంచిది. ఇవి పాన్ కోటింగ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఆహారంలో పాన్ కోటింగ్ కలిస్తే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
నాన్‌స్టిక్ ప్యాన్‌లో హై టెంపరేచర్‌లో ఏ పదార్ధాన్ని వండకూడదు. ఎందుకంటే ప్యాన్ కోటింగ్ కరిగి..ఆహారంలో కల్సిపోయి విషతుల్యమయ్యే ప్రమాదముంది. ఒకవేళ మాంసం లేదా బర్గర్ వంటి ఏదైనా పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండితే అది ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.