Lakshmi Narayana yogam 2024: మరో రెండు రోజుల్లో అరుదైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారి ఇళ్లలో ధనప్రవాహాం..

Sat, 21 Sep 2024-8:50 am,

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్నియోగాలు మనిషిజీవితాన్ని మార్చేస్తాయని చెప్పుకొవచ్చు. వీటిలో గజకేసరియోగం, త్రికోణయోగం, పారిజాతయోగం,లక్ష్మీనారాయణ యోగం కూడా చెప్తుంటారు.  ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగం అనేది బుధుడు,శుక్ర గ్రహాల కలయి వల్ల ఏర్పడుతుంది. సెప్టెంబరు 22 నుంచి ఈ యోగం ఏర్పడనుందని తెలుస్తోంది  

బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి.అదే విధంగా.. శుక్రగ్రహానికి  లక్ష్మీదేవీ అధిష్టానదేవతగా చెప్తుంటారు. ఈదేవతల ప్రభావం ఈ గ్రహాలపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈసారి ఇప్పుడు ఏర్పడబోయే .. లక్ష్మీనారాయణ యోగం వల్ల కొన్ని రాశులలో లైఫ్ ఒక్కసారిగా మారిపోనుందని చెప్పుకొవచ్చు.

మిథునం ఈ రాశివారికి ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగంవల్ల అపార ధనలాభాలు వీరి సొంతమౌతాయి. చేపట్టిన పనుల్ని విజయవంతగా పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు వీరికి అందుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.  

మకరరాశి.. ఈరాశివారికి ఈ యోగం వల్ల.. ఐశ్వర్యాలు సిద్దిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి గుడ్ న్యూస్ అందుతుంది. తల్లివైపు వారి నుంచి మంచి సంబంధం కుదురుతుంది.  

కుంభ రాశి.. ఈ రాశివారికి ఈ యోగం వల్ల ధనప్రవాహాం కల్గుతుందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని మోసం చేసినవాళ్లు తప్పులు తెలుసుకుని మరల మీదగ్గరకు వస్తారు. అంతేకాకుండా.. డబ్బులు ఎక్కువగా సంపాదించే బిజినెస్ లు చేస్తారు.  

 తులరాశి.. ఈరాశి వారికి మెయిన్ గా లాటరీలు తగిలే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొవచ్చు. అంతేకాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులో సఖ్యత ఏర్పడుతుంది.  

ధనస్సు.. ఈరాశివారికి కూడా పట్టుకున్నదే బంగారం అన్న చందంలో ఏ పనిచేపట్టిన కూడా విజయవంతంగా పూర్తవుతుంది. మీ పై అధికారులు మెప్పులను పొందుతారు. ఇన్నిరోజులుమీరు అవ్వలేదని, ఎదురుచూస్తున్న పనులన్ని, ఇప్పుడు పూర్తవుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link