Left Handers: మీరు లెఫ్ట్ హ్యాండరా అయితే ఈ అరుదైన లక్షణం మీలో ఉన్నట్టే
భారతదేశ జనాభాలో 10 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారని అంచనా. లెఫ్టీస్ అని, లెఫ్ట్ హ్యాండర్లని పిలుస్తుంటాం. గొప్ప గొప్ప వ్యక్తుల్లో కూడా లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు.
చాలామంది పిల్లలు చిన్నతనంలో ఎడమ చేతి నుంచి ఏదైనా చేస్తుంటే మనం కుడి చేయి అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటాం. కానీ అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోదీ, సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప వ్యక్తులు లెఫ్ట్ హ్యాండర్లు.
సంగీతం, క్రీడల్లో టాప్
ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తుల్లో సంగీతంపై మంచి పట్టు ఉంటుంది. ఎడమ చేయి ఎక్కువగా వినియోగించేవారిలో టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ప్రతిభ చూపిస్తారు
ఓ అధ్యయనం ప్రకారం లెఫ్ట్ హ్యాండర్లలో ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. అందుకే వీళ్లు సాధారణంగా భయస్తులుగా ఉంటారు. కానీ లెక్కల్లో మాత్రం వీళ్లు చాలా షార్ప్
బ్రెస్ట్ కేన్సర్ ముప్పు
ఎడమ చేయి ఎక్కువగా ఉపయోగించే మహిళల్లో మెనోపాజ్ కంటే ముందు బ్రెస్ట్ కేన్సర్ ముప్పు ఎక్కువగా కలిగి ఉంటారు. హార్మోనల్ మార్పులు కూడా ఉంటాయి
Disclaimer
ఈ వార్త కేవలం పాఠకుల అవగాహన కోసమే. కొన్ని అధ్యయనాల ప్రకారం రాసిందే తప్ప శాస్త్రీయ ఆధారం లేదు. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు