Lata Mangeshkar Career: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కెరీర్‌లో వివిధ ఘట్టాలు ఇవే
1974లో లతా మంగేష్కర్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అత్యధిక పాటలు 25 వేల పాటలు పాడినందుకు నమోదైంది.
లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాలులో 1974లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలు.
లంతా మంగేష్కర్ తొలిసారిగా 1955లో సంగీతం కంపోజ్ చేశారు. మరాఠీ సినిమా రామ్ రామ్ పావ్‌హనే సినిమాకు సంగీతం అందించారు. ఆ తరువాత చాలా మరాఠీ సినిమాలకు సంగీతం అందిస్తూ వచ్చారు.
లతా మంగేష్కర్ తొలిపాట 1942లో రికార్డైంది. మరాఠీ సినిమాలో ఆమె తొలిపాట రికార్డు కావడం విశేషం
1938లో 9 ఏళ్ల వయస్సులో తొలిసారిగా షోలాపూర్‌లోని నూతన్ ధియేటర్‌లో అందరి ముందు లతా మంగేష్కర్ పాడారు.
లతా మంగేష్కర్ 5 ఏళ్ల ప్రాయం నుంచి పాటలు పాడటం ప్రారంభించారు. అప్పటి ప్రముఖ సంగీత కళాకారులు అమన్ అలీ ఖాన్ సాహెబ్, అమానత్ ఖాన్ల వద్ద సంగీతం నేర్చుకున్నారు.
లతా మంగేష్కర్ అసలు పేరు హేమ. ఆ తరువాత లతా మంగేష్కర్‌గా పేరు మార్చుకున్నారు.
జనవరి 8వ తేదీన కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్ కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు. తిరిగి ఫిబ్రవరి 5వ తేదీన ఆసుపత్రిలో చేరారు.
లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయస్సులో ఇవాళ ఉదయం 8 గంటల 12 నిమిషాలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.