LIC Policy: ఎల్ఐసీలో అదిరే పాలసీ..రోజుకు రూ. 45 పొదుపు చేస్తే రూ. 25లక్షల బీమా పొందవచ్చు
LIC Jeevan Anandar Policy: నేటికాలంలో ప్రతిఒక్కరికీ పాలసీఅనేది తప్పనిసరి. మార్కెట్లో చాలా రకాల పాలసీలు ఉన్నాయి. అయితే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు ఏదైనా సేవింగ్స్ కి సంబంధించిన పాలసీ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఎదుర్కునే ఇబ్బందులకు ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది.
చిన్నపొదుపుతో పెద్ద మొత్తం నగదు పొందాలని అందరు కోరుకుంటారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కరెక్టుగా మీకు ఇలాంటి ప్రయోజనాన్నే అందిస్తుంది. ఈ పాలసీలో మీరు రోజుకు రూ. 45పొదపు చేసినట్లయితే రూ. 25లక్షల వరకు పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తం పొందాలనుకుంటే ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ మంచి ఆప్షన్. ఇది ఒకరకంగా టర్మ్ పాలసీ వంటిది. ఈ పాలసీ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కనీస బీమా రూ. 1లక్ష. మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. ఎలాంటి లిమిట్ లేదు.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో రూ. 5లక్షల ఆప్షన్ ఎంచుకున్నట్లయితే 35ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్ తీసుకుంటే మీ చేతికి రూ. 25లక్షలు అందుతాయి. ఈ 35 ఏళ్లపాటు ఏడాదికి రూ. 16,300చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ. 1,358 రోజుకు కేవలం రూ. 45 మాత్రమే ఉంటుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ. 25లక్షల వరకు అందుతాయి.
అందులో బీమా మొత్తం రూ. 5లక్షలు, బోనస్ రూ. 8లక్షలు, ఎఫ్ఏబీ రూ. 11.5లక్షల ఉంటాయి. 15 ఏళ్ల తర్వాత రెండుసార్లు బోనస్ వస్తుంది. అలాగే ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా వందేళ్ల వరకు లైఫ్ టైమ్ కవరేజీ ఉంటుంది. ఒకవేళ పాలసీ కడుతున్న సమయంలో పాలసీదారుడు మరణించినట్లయితే డెత్ క్లెయిమ్ కూడా లభిస్తుంది.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో పన్ను మినహాయింపు లేదు. కానీ ప్రమాద మరణం..అంగవైకల్యం, ప్రమాద ప్రయోజనం, కొత్త టర్మ్ భీమా, కొత్త క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటివి ఉన్నాయి. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో డెత్ క్లెయిమ్ ప్రయోజనాలు ఉన్నాయి. పాలసీదారుడు నామినీకి 125శాతం ప్రయోజనం లభిస్తుంది. పాలసీ ముగిసేలోపు మరణిస్తే..నామినీకి కచ్చితమైన కాలానికి సమానం డబ్బు వస్తుంది.
ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం జీవన్ ఆనంద్ పాలసీతోపాటు పలు రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో టర్మ్ ప్లాన్స్, చిల్డ్రన్ ప్లాన్, మనీబ్యాంక్ పాలసీలు వంటి పలు రకాల పాలసీలు ఉన్నాయి. ఇందులో పెన్షన్ ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి మీకు నచ్చిన పాలసీని కూడా ఎంచుకోవచ్చు.