LIC policy holders: ఎల్ఐసి పాలసీ హోల్డర్స్‌కి Good news.. LIC IPO వీళ్లకే ప్రాధాన్యత
ఎల్‌ఐసి ఐపిఓను 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2021 ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎల్‌ఐసి పాలసీదారులకు ఎల్ఐసి ఐపిఓలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) సూచించిందని సమాచారం. ప్రస్తుతం ఎల్‌ఐసి 25 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో 4.5 కోట్లకు పైగా Demat account holders ఉన్నారు. ఎల్ఐసి పాలసీదారులకు ఐపీఓలో రిజర్వేషన్ కారణంగా ఐపిఓ ప్రారంభించేనాటికి 1 కోటికి పైగా మంది కొత్తగా డిమాట్ ఎకౌంట్స్ తెరుచుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
CDSLకు, దాని హోల్డింగ్ కంపెనీ అయిన BSE కి ఇది బిగ్ న్యూస్ అవుతుందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. LIC policy agents కూడా ఇదే విషయాన్ని తమ కస్టమర్స్‌కి వివరించి మరింత Business చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.