Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..
చాలా మంది హోటళ్లలో ఏవైన ఆర్డర్ లు పెట్టగానే టమాటాలు, ఆనియన్స్, కీర దోసకాయలు ప్యాకేట్ లలో వస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. కీర దోసకాయలో 95 శాతం వాటర్ ఉంటుందని చెబుతుంటారు..
కీరదోసను ఎక్కువగా తింటే క్రమంగా ఊబకాయం తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం పూట కీర దోస లేదా దీనితో తయారు చేసిన జ్యూస్ తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కల్గిస్తుంది.
డయాబెటిక్ రోగులకు కీరదోస ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దీనిలో మాంగనీస్, జింక్, ఫాస్పరస్, విటమిన్లు ఉంటాయి. కీరను తింటే శరీరంలో వ్యర్థాలు మూత్రం రూపంలో బైటకు వెళ్లిపోతాయి.
జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు తింటే ఎంతో మేలు కల్గిస్తుంది. నోటిలో పుండ్లు ఉన్న వారు, పొట్టలో పుండ్లున్నవారు కీరాను ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
కీర దోసకాయను సాల్ట్ వేసి తినాలి. మరికొందరు కీరాను, ముఖానికి మాస్క్ లాగా పెట్టుకుంటారు. కంటి సమస్యలున్న వారు.. రాత్రిపూట కీర దోసకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి కళ్లమీద పెట్టుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కళ్ల మీద పెట్టుకుంటే, వేడిమి నుంచి ఎంతో ఉపశమనం కల్గుతుంది. అన్నం తిన్నాక తింటే చక్కగా అరుగుతుంది. కీరను పప్పులలో, ఆవకాయలుగా, చట్నీలుగా కొందరు చేసుకుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)