How to apply for SBI e-auction: తక్కువ ధరకే ఇల్లు, దుకాణం, ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు కావాలా ?

Sun, 10 Jan 2021-3:06 pm,

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తక్కువ రేటుకే ఆస్తిని సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. కానీ ఈ అవకాశం 2020 డిసెంబర్ 30 వరకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్‌పై ఆసక్తి ఉన్న వారందరూ ఎస్బీఐ నిర్వహించే ఇ వేలం ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

తమ బ్యాంకు నుండి రుణం తీసుకుని, ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన ( Failure in repayment of loans ) వారి ఆస్తులను ఇ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఎస్బీఐ ట్విటర్ ద్వారా ప్రకటించింది.

ఏదైనా ఒక ఆస్తిని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం ( Mortgage loans ) తీసుకున్న తర్వాత.. రుణగ్రహీతలు తమ రుణాలు చెల్లించలేని క్రమంలో ఆ ఆస్తులపై బ్యాంకులకు అన్ని హక్కులు కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే.

తనఖా పెట్టి రుణం ఎగ్గొట్టిన వారి ( Non payment of mortgage loans ) ఆస్తులనే తాజాగా ఇ-వేలం ద్వారా విక్రయించి.. తద్వారా వచ్చిన డబ్బులతో ఆయా ఆస్తుల యజమానులు ఎగ్గొట్టిన రుణాన్ని తిరిగి వసూలు చేయాలనే యోచనలో బ్యాంక్ ఉంది.

వేలం వేసే ఆస్తులైన ఇల్లు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలను ( Houses, shops, industrial properties ) చూసి వాటిని కొనాలో లేదో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఆస్తులు, వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు ముందస్తుగా తెలియజేయబడతాయి.

వేలం ప్రక్రియలో పాల్గొనే ముందు, మీరు ఆసక్తి చూపిస్తున్న ఆస్తి వివరాలు, అది ఎక్కడుంది? ఆస్తి ఎంత విలువ చేస్తుంది అనే ఇతర విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా, దీనికి సంబంధించి సమాచారం ఇవ్వడానికి బ్యాంక్ ఒక వ్యక్తిని కూడా నియమిస్తుంది.

ఎస్బిఐ బ్యాంక్ ( SBI Bank ) వెల్లడించిన సమాచారం ప్రకారం... 758 నివాస ఆస్తులు, 251 వాణిజ్య ఆస్తులు, 98 పారిశ్రామిక ఆస్తులు వచ్చే 6 రోజుల్లో వేలానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలావుండగా, ఎస్బిఐ రానున్న 30 రోజుల్లో ఇదే తరహాలో 3032 నివాస ఆస్తులు, 844 వాణిజ్య ఆస్తులు, 410 పారిశ్రామిక ఆస్తులను వేలం ( Auction ) వేయనుంది. ( Image courtesy : PTI Photo )

మీరు ఇ వేలం ప్రక్రియలో పాల్గొనాలనుకుంటే, ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో మీ ఇమెయిల్, మొబైల్ నెంబర్ ఆధారంగా పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు నో యువర్ కస్టమర్ ( SBI KYC ) కేవైసి ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Also read : LPG cylinders prices to change weekly: LPG cylinders ధరలు ఇక వారానికి ఓసారి మార్పు ?

 

Also read : PM KISAN scheme: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి డబ్బులు ఎప్పుడు పడతాయి ?

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link