Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!
హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్.. ఇది అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అని అందరికీ తెలిసిందే. ఈ బ్యాంకులో మీరు పర్సనల్ లోనికి అప్లై చేస్తే 10.5 నుంచి 24% వరకు వడ్డీ రేట్లపై రుణం అందిస్తాయి. ఇందులో రూ. 5000 వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.
ఐసిఐసిఐ బ్యాంక్.. ఇది ప్రైవేట్ సెక్టార్ లోని రెండో అతిపెద్ద రంగా బ్యాంకు. ఇందులో పర్సనల్ లోన్ కి 10.65% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న మొత్తాన్ని బట్టి ఇతర టాక్స్ లు కూడా ఉంటాయి.
ఎస్బిఐ.. ఇది అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఇందులో 12.30 శాతం నుంచి 14.30% వరకు వసూలు చేస్తాయి. అయితే గవర్నమెంట్ ప్రభుత్వంగా ఎంప్లాయిస్ నుంచి 11.30% నుంచి 13.80 శాతం వరకు వడ్డీనిలకు వసూలు చేస్తాయి. డిఫెన్స్ వారికి 11.15 నుంచి 12.65% వరకు ఏడాదికి పర్సనల్ లోన్ పై వడ్డీని వసూలు చేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఇది ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఇందులో పర్సనల్ లోన్ పై 13.15 నుంచి 16.75% వరకు వడ్డీలు వసూలు చేస్తుంది ఇక ప్రభుత్వం గా ఎంప్లాయిస్ కి అయితే 12.40% నుంచి 16.75% వరకు అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంకులో వడ్డీలు 13.75% నుంచి 17.25% వరకు ఆ వ్యక్తి తీసుకున్న మొత్తాన్ని మీద ఆధారపడి క్రెడిట్ స్కోర్ తో లింక్ చేసి వసూలు చేస్తారు. ప్రభుత్వ జాబ్ ఉన్నవారికి 12.75 నుంచి 15.25% వరకు వసూలు చేస్తారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్.. ఈ బ్యాంకులో 10.99% వరకు పర్సనల్ లోన్ పై వడ్డీని వసూలు చేస్తుంది దీనికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు ఇతర టాక్స్ డబ్బులు వసూలు చేస్తుంది.
యాక్సిస్ బ్యాంక్..
యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునే వారికి 10.65% నుంచి 22% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్.. ఇండస్ఇండ్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునే వారికి 10. 49 శాతం వరకు ఏడాదికి వడ్డీ రేటును వసూలు చేస్తుంది దీనికి ఆధారంగా ప్రాసెసింగ్ ఫీజు 3% వసూలు చేస్తుంది ఇందులో 30,000 నుంచి 50 లక్షల వరకు రుణం పొందవచ్చు.
కరూర్ వైశ్యా బ్యాంక్.. ఈ బ్యాంకులో 11%, 13% ఏడాదికి పర్సనల్ లోన్ పై వడ్డీని వసూలు చేస్తాయి ఇది 2023 డిసెంబర్ 31 నుంచి అమల్లో ఉంది.
ఎస్ బ్యాంక్.. ఎస్ బ్యాంకులో పర్సనల్ లోన్ పై వడ్డీ రేట్లు 10.49% నుంచి ప్రారంభం అవుతుంది. 72 నెలల వరకు గడువు ఉంటుంది 50 లక్షల వరకు రుణమాందిస్తారు