Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి
వస్తు సేవల పన్ను(GST)కి సంబంధించిన కొత్త రూల్ నేటి నుంచి అమలు కానుంది. లాటరీపై ఇకనుంచి 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్ గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. లాటరీ ధరలు భారీగా పెరగనున్నాయి.
Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు
FASTag News Latest Update: ఇకనుంచి ఫాస్టాగ్ తీసుకోవాలంటే డబ్బు చెల్లించాలి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఫిబ్రవరి 28 వరకు ఉచితంగా ఫాస్టాగ్(FASTag) అందించింది. మార్చి 1వ తేదీ నుంచి డబ్బు చెల్లించి ఫాస్టాగ్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) ఖాతాదారులు KYCని అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ అప్‌డేట్ చేయనివారు, వివరాలు సరిగ్గా లేకపోతే బ్యాంకు సర్వీసులు నిలిచిపోనున్నాయి.
ప్రతిరోజూ పెరుగుతున్న ఇంధన ధరలు త్వరలోనే దిగిరానున్నాయని మార్చి నెల నుంచే ఆ మార్పు కనిపించవచ్చునని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. చలికాలం ముగియగానే చమురు ధరలు దిగొస్తాయని, తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు
రూ.2000 కరెన్సీ నోటును ఏటీఎంలో వినియోగించడం లేదని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మార్చి 1 నుంచి ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలల్లో రూ.2 వేల నోటు ఇక కనిపించదు. బ్యాంకులో మాత్రమే రూ.2000 నోటు అందుబాటులో ఉంచారు.