NHAI FAQs: ఒక వాహనం FASTagను వేరే వాహనానికి ఉపయోగించవచ్చా, కారు అమ్మితే ఏం చేయాలి

NHAI Answered Frequently Asked Questions On FASTag for Users: ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ గురించి నెలకొన్న ముఖ్యమైన సందేహాలపై నేషనల్ హైవే అథారిటీ(NHAI) తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 17, 2021, 01:09 PM IST
  • జాతీయ రహదారి గుండా ప్రయాణించాల్సి వస్తే, ఫాస్టాగ్ ఉండటం తప్పనిసరి
  • ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలు చేశారు
  • అయితే ఫాస్టాగ్‌పై నెలకొన్న 10 ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు ఇవి
NHAI FAQs: ఒక వాహనం FASTagను వేరే వాహనానికి ఉపయోగించవచ్చా, కారు అమ్మితే ఏం చేయాలి

NHAI Answered Frequently Asked Questions On FASTag for Users: మీరు జాతీయ రహదారి గుండా ప్రయాణించాల్సి వస్తే, మీ కారుకు ఫాస్టాగ్ ఉండటం తప్పనిసరి. లేనిపక్షంలో మీరు రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఫోర్ వీలర్(నాలుగు చక్రాల) వాహనాలకు ఫాస్టాగ్ అవసరం అయ్యింది.

మీరు ఇంకా మీ వాహనానికి ఫాస్టాగ్ అతికించకపోతే త్వరగా తీసుకోండి. అదే సమయంలో ఫాస్టాగ్‌కు సంబంధించి మీకు కొన్ని సందేహాలు ఉండి ఉంటాయి. ఫాస్టాగ్(FASTag Latest News) గురించి నెలకొన్న ముఖ్యమైన సందేహాలపై నేషనల్ హైవే అథారిటీ(NHAI) తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి

1. ప్రశ్న) ఫాస్టాగ్ ట్యాగ్ చెల్లింపులకు ఏమైనా తగ్గింపు ధర, ఆఫర్ దొరుకుతుందా?
జవాబు - ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజా ఫీజు చెల్లించే వినియోగదారులకు 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని వారంలోపు వారి ఫాస్ట్‌టాగ్ ఖాతా(FASTag Account)కు చేరతాయి.

2. ప్రశ్న) ప్రతి రైలుకు వేర్వేరు ఫాస్టాగ్ తీసుకోవాలా?
జవాబు - అవును, మీరు ప్రతి రైలుకు వేర్వేరు ఫాస్టాగ్ తీసుకోవాల్సి ఉంటుంది.

3. ప్రశ్న) ఒక వాహనం యొక్క ఫాస్టాగ్‌ను మరొక వాహనానికి ఉపయోగించవచ్చా?
జవాబు - అలాంటి అవకాశమే లేదు. ప్రతి వాహనానికి KYC పత్రాలను సమర్పించిన తరువాత ఫాస్టాగ్ జారీ అవుతుంది. ఒక కారు కోసం కొనుగోలు చేసిన ఫాస్టాగ్‌ను మరో వాహనానికి ఉపయోగించారు అనుకుందా.. అప్పుడు అలాంటి ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. ఇలాంటివి అసలు చేయవద్దని వినియోగదారులను హెచ్చరించింది.

Also Read: EPFO ఖాతాదారులకు Bad news.. PF interest rates తగ్గే అవకాశం

4. ప్రశ్న) ఎవరైనా వారి ఫాస్ట్‌ట్యాగ్‌ను కోల్పోతే, అందులో ఉన్న బ్యాలెన్స్‌కు ఏమవుతుంది?
జవాబు - మీరు ఫాస్టాగ్ జారీ చేసే సంస్థ యొక్క కస్టమర్ కేర్ కు వెంటనే కాల్ చేసి బ్లాక్ చేయించాలని NHAI సూచించింది. మీరు క్రొత్త ఖాతాను తీసుకున్నప్పుడు, కంపెనీ మీ బకాయిలను కొత్త ఖాతాకు బదిలీ చేస్తుంది, అంటే మీ మొత్తం సురక్షితంగా ఉంటుంది.

5. ప్రశ్న) మా ఖాతా నుండి సరైన నగదు మొత్తం కట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి?
జవాబు - మీ ఫాస్టాగ్ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయినప్పుడు, మీ రిజిస్టర్ మొబైల్‌కు ఒక SMS వస్తుంది. టోలో ప్లాజాలో కనిపించినంత కట్ అయిందో లేదో మెస్సేజ్ ద్వారా తెలుసుకుని నిర్ధారించుకోవాలి.

6. ప్రశ్న) నేను టోల్ ప్లాజాకు 10 కిలోమీటర్ల పరిధి దూరంలో నివసిస్తున్నాను. అయితే ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా?
జవాబు - మీరు ఇంకా ఫాస్టాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫాస్టాగ్ పరిధిలోకి వచ్చే లేన్ ద్వారా ప్రయాణిస్తే కచ్చితంగా ఫాస్టాగ్ తీసుకోవాలి.

Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

7. ప్రశ్న) నేను ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి వేరే నగరానికి మారితే పరిస్థితి ఏమిటి?
జవాబు - దేశవ్యాప్తంగా ప్రతి టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ పనిచేస్తుంది. మీరు కొత్త నగరానికి మార్చినప్పుడు, ఫాస్టాగ్ జారీ చేసే సంస్థ కస్టమర్ కేర్(Customer Care)కు కాల్ చేసి మీ చిరునామా(Address)ను అప్‌డేట్ చేసుకోవాలి.

8. ప్రశ్న) ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు(FASTag) ఉపయోగించవచ్చా?
జవాబు - ఇది అసలు సాధ్యం కాదు. ఒక వాహనంలో ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్ ఉపయోగించినట్లయితే, వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటారు.

9. ప్రశ్న) నేను నా కారును అమ్మినా లేదా బదిలీ చేసినా ఏం జరుగుతుంది?
జవాబు - మీరు మీ కారును అమ్మినా లేదా మరొకరికి బదిలీ చేసినా, ఫాస్టాగ్ జారీ చేసే సంస్థకు మాత్రం తెలియజేయాలి. ఆ తరువాత విషయాలు వాళ్లే చూసుకుంటారు.

Also Read: FASTag: నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి

10. ప్రశ్న) జాతీయ రహదారి మినహా వేరే మార్గంలో ఎక్కడైనా ఫాస్టాగ్ ఉపయోగించవచ్చా?
జవాబు - ఫాస్ట్‌టాగ్‌ను రాష్ట్ర ప్రభుత్వ రహదారులకు సైతం విస్తరించే ఆలోచన చేస్తున్నారు. ఫాస్టాగ్ ద్వారా పార్కింగ్ ఛార్జీలు,  ఇతర రోడ్డు సంబంధ సౌకర్యాల కోసం వినియోగించేందుకు యోచిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News