LPG Gas Prices: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు.. డిటెయిల్స్ ఇవే..

Thu, 01 Aug 2024-11:23 am,

బడ్జెట్ తర్వాత సామాన్య ప్రజలకు చమురు కంపెనీలు భారీ షాక్‌ ఇచ్చాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిత్యావసరాల ధరలు చుక్కల్నితాకుతున్నాయి. ఈ క్రమంలో తాజగా, చములు కంపెనీలు ఆగస్టు 1 తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతు నిర్ణయం ప్రకటించాయి. 

 గ్యాస్‌ సిలిండర్‌ కంపెనీలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.9.50 పెంచినట్లు తెలుస్తోంది.. కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేనట్లు సమాచారం. ఈ పెంపు వల్ల పలు రాష్ట్రాలలో  సిలీండ్ ధరలు భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సిలిండర్ ధరలు.. రూ. 1650 కు చేరింది. హైదరాబాద్ లో.. రూ. 1890 గా ఉన్నట్లు తెలుస్తోంది.

IOCL వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మారిన రేట్లు ఈరోజు అంటే ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఎల్‌పీజీ.. సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సిలిడంర్ ధరల్లో వచ్చే మార్పులను ప్రకటిస్తుంటాయి.. 

 

ఈ క్రమంలోనే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.9.50 పెంచాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ధర రూ.1650 గా మారింది. ఈ సిలిండర్ వెస్ట్ బెంగాల్ లో రూ.1860.50కి అందుబాటులో ఉంటుంది. ఈ సిలిండర్ నాగ్ పూర్ లో రూ.1630, తమిళనాడులో సిలిండర్ ధర రూ. 1850 కి చేరింది. హైదరాబాద్‌లో రూ.1890 గా ఉంది.

14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేవని తెలుస్తోంది. ఇది ఢిల్లీలో రూ. 820, వెస్ట్ బెంగాల్ లో రూ. 840, నాగ్ పూర్ లో రూ. 830.50, తమిళనాడులో రూ. 830.50గా ఉంది. సాధారణ కస్టమర్లకు ఢిల్లీలో దీని ధర రూ. 830 గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.890గా ఉంది. అదే ఉజ్వల లబ్ధిదారులకు దీని ధర రూ. 603గా ఉంది.  

ఆగస్టు మొదటి తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబెలెత్తి పోతున్నారు. ఇప్పటికే ఒకవైపు నిత్యవాసరాల ధరలు, మరోవైపు కూరగాయల ధరలు కూడా భారీగానే పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సిలిండర్ ధరలు కూడా పెరగటంతో కూడ ప్రజలు అల్లాడిపోతున్నట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link