LPG Price hiked: భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు.. ఇకపై LPG కి ఎంత Pay చేయాలంటే..

Thu, 04 Feb 2021-3:20 pm,

LPG prices in Hyderabad: హైదరాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ ధరలు : ఎల్‌పిజి సిలిండర్ల ధరల పెరుగుదల అనంతరం హైదరాబాద్‌లో నిన్నటి వరకు రూ.746.50 గా ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరల నేటి నుంచి రూ .771.50 కి పెరిగింది.

LPG prices in other metros: LPG prices in Delhi రూ .719 గా ఉండగా, కోల్‌కతాలో ఎల్‌పిజి ధర ఇప్పుడు రూ .745.50 గా, ముంబైలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .719 గా మారగా, చెన్నైలో ఎల్‌పిజి గ్యాస్ ధర ప్రస్తుతం సిలిండర్‌కు రూ .735 గా మారింది. బెంగళూరులో ఎల్‌పిజి ధర 722 రూపాయలుగా, చండీఘడ్‌‌లో ఎల్‌పిజి ధర 728.50 రూపాయలుగా ఉంది.

గుర్గావ్‌లో ఎల్‌పిజి ధర 728 రూపాయలు కాగా, జైపూర్‌లో ఎల్‌పిజి గ్యాస్ ధర 723 రూపాయలుగా ఉంది. బిహార్ రాజధాని పాట్నాలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ .792.50 కి చేరింది.

2020 డిసెంబర్‌లో, చమురు కంపెనీలు రెండుసార్లు ఎల్‌పిజి ధరలను ( LPG prices ) పెంచాయి. జనవరి 2021 లో ఎల్‌పిజి ధరలను సవరించలేదు కనుక ఫిబ్రవరి 2021 లో చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలను పెంచుతాయని ఊహించినట్టుగానే నేడు ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి.

భారత్‌లో ఎల్‌పిజి ధరలను ప్రభుత్వరంగ చమురు సంస్థలైన IOCL లాంటి Oil companies నిర్ణయిస్తాయి. నెలవారీగా ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ప్రస్తుత మార్కెట్ దృష్ట్యా పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని భరించవలసి ఉన్నందున ఎల్‌పిజి ధరలను పెంచక తప్పడం లేదని IOCL, BPCL, HPCL చెబుతున్నాయి.

ఇందులో కొంతమేరకు relief ఇచ్చే అంశం ఏంటంటే... ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలపై భారత ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ( Subsidy on domestic LPG cylinders prices ) అందిస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తుల బ్యాంక్ ఖాతాకు ( LPG subsidy in bank accounts ) జమ అవుతుంది.

సబ్సిడీ మొత్తం ప్రతి నెలా మారుతూ ఉంటుంది. Dollar value తో పాటు సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్ ఎల్పిజి ధరలలో మార్పుల ఆధారంగా ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలు సవరిస్తుంటాయనే సంగతి తెలిసిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link