KL Rahul Birthday: కేఎల్ రాహుల్ బర్త్ డే స్పెషల్.. తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు

Tue, 02 May 2023-1:15 pm,

లక్నో జట్టును కేఎల్ రాహుల్ విజయపథంలో నడిపిస్తున్నాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేర్చగా.. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గెలిపించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో రెండో స్థానంలో ఉంది. 

వన్డే అరంగేట్రంలోనే సెంచరీ బాదిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్. జూన్ 2016లో జింబాబ్వేపై రాహుల్ ఈ ఘనత సాధించాడు.    

మార్చి 2017 నుంచి ఆగస్టు 2017 వరకు టెస్టు క్రికెట్‌లో వరుసగా 7 అర్ధశతకాలు సాధించిన రికార్డు కేఎల్ రాహుల్‌ పేరు మీద ఉంది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ అతనే కావడం విశేషం.

కేఎల్ రాహుల్ ఈ ఏడాది జనవరిలో బాలీవుడ్ స్టార్ అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. అతియా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె. 2021లో నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు.  

టెస్టుల్లో పేలవ ఫామ్‌తో వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ తరువాత వన్డే సిరీస్‌లో వెంటనే తన బ్యాట్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నా కేఎల్ రాహుల్. ఐదు మ్యాచ్‌ల్లో 155 పరుగులు చేశాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link