Mahalaya Amavasya: మహాలయ అమావాస్య రోజున ఇలా చేయండి.. పెద్దల ఆశీర్వాదం.. ధనలక్ష్మీ కటాక్షం మీ సొంతం..

Mon, 30 Sep 2024-10:23 am,

భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం పెద్దలకు ఎంతో ఇష్టమైన కాలం. ఈ పక్షం రోజుల్లోనే మన పెద్దలు అన్న ప్రసాదంతో పాటు జలమును కోరుతారు. ఈ పక్షం లో చేసిన పుణ్య కార్యాలు అనంతమైన ఫలితాలను అందిస్తాయి.

ముఖ్యంగా మనం ఎంత భక్తులమైనా, దేవీ దేవతల ఉపాసకులమైనా పితృకార్యములు చేయనివారికి కష్టాలు తప్పవు. సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడు, భగవాన్ కృష్ణుడు కూడా పితృ కార్యక్రమాలు చేసారు. మనం చేయకపోతే ఎలా.శ్రాద్ధ తిథి నాడు  తప్పక తర్పణాలు విడవాలి. వాటికి మినహాయింపు లేదు. శ్రాద్ధములో కొన్ని విధానాలు.

  1. క్షణ శ్రాద్ధం - యోగ్యులైన బ్రాహ్మణ భోక్తలను విశ్వే, పితృస్థానాలలో ఆహ్వానించి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించడం ఇదో పద్దతి..

2. కూర్చ శ్రాద్ధం - యోగ్యులు దొరకకపోతే, దర్భలలో విశ్వే, పితృదేవతలను ఆహ్వానం చేసి శాస్త్రోక్తంగా శ్రాద్ధ కార్యం జరిపించడం.

3. ఆమ శ్రాద్ధం - క్షణ, కూర్చ శ్రాద్ధం  రెండు కుదరనప్పుడు స్వయంపాకం, దక్షిణతో దానం ఇవ్వడం. ఇదే పద్ధతి.

4. హేమ శ్రాద్ధం - ఇవేవి  కుదరనప్పుడు, శ్రాద్ధముకు తగిన హిరణ్యం (బంగారం), వెండి లేదా ధనమును దానం చేయడం.

5. సంకల్ప తర్పణము - మనకు సమయం  కుదరనప్పుడు సంకల్పం చెప్పుకొని అర్ఘ్యం, తర్పణాలు ఇవ్వడం మరో పద్దతి.

6. గోగ్రాస ప్రధానము - ఇవేవి కుదరనప్పుడు గోవుకు యథాశక్తి గ్రాసం సమర్పించి, గోవుకు,పితృదేవతలకు నమస్కరించడం.

7. పితృ ప్రార్థన - రెండు చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలారా..! నేను పైన చెప్పిన ఏ విధమైన శ్రాద్ధం పెట్టలేని అశక్తుడిని. నాదగ్గర ధనం లేదు. కనీసం గోవుకు గ్రాసం కూడా ఇచ్చే స్థితిలో కూడా లేను. దయచేసి నన్ను మన్నించండని ప్రార్థించి చేసే పితృ కార్యం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link